ఈ సినిమా కూడా సమరసింహారెడ్డి సినిమా మాదిరిగానే ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇలా వరుసగా నాలుగు విజయవంతమైన సినిమాల తర్వాత మూవీ గా పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమా వీరి కాంబోలో రూపొందింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దానితో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా ఐదు సినిమాలు రూపొందిన వీరి కాంబోలో ఆరవ మూవీగా హరహర మహాదేవ అనే సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ రావడం మాత్రమే కాకుండా ఈ మూవీ లాంచింగ్ వేడుకను కూడా నిర్వహించారు.
కొన్ని పోస్టర్లను కూడా మేకర్స్ విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా ఆగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు బి.గోపాల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ... బాలకృష్ణతో హర హర మహాదేవ సినిమాను అనౌన్స్ చేసాం. కానీ అప్పటికి మా దగ్గర కథ లేదు. ఆ సినిమా నిర్మాత సురేష్ ఒక దర్శకుడు దగ్గర కథ ఉంది ... దానితో చేద్దాం అన్నాడు. కానీ ఆ తర్వాత ఆ దర్శకుడు కథ చెప్పలేదు. ఇక చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే దానిని విన్నాం. కానీ అది కూడా పెద్దగా నచ్చలేదు. దానితో ఎంత ప్రయత్నించినా కథ దొరకపోవడంతో బాలకృష్ణతో ఆ సినిమాను ఆపివేశం అని గోపాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.