టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ల మనీషా కొయిరాలా కూడా ఒకరు.. ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించి మంచి విజయాలను అందుకున్నది. ఇటీవల మనీషా కొయిరాలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. గతంలో తనకు క్యాన్సర్ ఉన్న సంగతిని తెలియజేస్తూ అందుకు తగ్గట్టుగా తాను చికిత్స కూడా తీసుకుని రోజులను తెలియజేసింది మనీషా కొయిరాలా.ముఖ్యంగా తను చికిత్స తీసుకునే సమయంలో ఎదుర్కొన్న అనుభవాలను తెలియజేసింది. వైద్యులు చికిత్స తో పాటుగా తల్లి ప్రోత్సాహం ఉండడం వల్లే తాను ఇప్పుడు బయట తిరగగలుగుతున్నాం అంటే తెలియజేసింది.


2012 సమయంలో మనిషా కొయిరాల అండాశయా క్యాన్సర్ బారిన పడిందట. మూడు సంవత్సరాల పాటు చికిత్స అనంతరం ఆమె క్యాన్సర్ ను జయించినట్లు తెలియజేసింది. అంటే 2015లో ఈమె పూర్తిగా కోరుకున్నట్లు తెలియజేసింది.. ప్రస్తుతానికైతే ఆరోగ్యంగా మనీషా కొయిరాలా ఉన్నది.అలా క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న రోజుల్లో గుర్తు చేసుకుంటూ ఆ సమయంలో చాలా భరించలేని బాధను నొప్పిని అనుభవించానని తెలియజేసింది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా తన శరీరంలో ఈ మహమ్మారి చివరి దశలో ఉన్న సమయంలో గుర్తించానని తెలిపింది. మొదట అందరిలాగే తాను కూడా భయపడి మరణిస్తానేమో అనుకున్నానని తెలిపింది మనీషా కొయిరాలా. సుమారుగా 11 గంటల పాటు తనకి ఆపరేషన్ చేశారని దీంతో తాను తిరిగి లేస్తాను అనిపించింది అంటూ తెలియజేసింది. అలాంటి చీకటి రోజులు మళ్ళీ రాకూడదని ఎవరికీ రాకూడదని తెలియజేసింది మనీషా కొయిరాలా.

న్యూయార్క్ లోని గొప్ప వైద్యులు తనకు చికిత్స చేశారని ఈ జీవితం తనకు దేవుడు ఇచ్చిన మరొక అవకాశం లాంటిది అంటూ తెలిపింది. హిరమండి అనే వెబ్ సిరీస్ లో కూడా నటించిన మనీషా కొయిరాల ఇప్పుడు రెండో భాగంలో కూడా నటించడానికి సిద్ధమయ్యిందట. మరి రాబోయే రోజుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఏదైనా సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: