సినిమాల పరంగా తన సత్తాను చాటుతున్న సమయంలోనే 2002లో విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహ అనంతరం వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. వివాహం తర్వాత కూడా నయనతార వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం నయనతార వరుసగా సినిమాలలో నటిస్తోంది. నయనతార ప్రస్తుతం యంగ్ హీరో కవిన్ తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కవిన్ రాణిస్తున్నాడు.
గతవారం ఈ హీరో నటించిన బ్లడీ బెగ్గర్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో అతడిని కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి కవిన్ చాలా ఓపికగా సమాధానమిచ్చాడు. అందులో మొదటగా మీకు ఏ హీరోయిన్ మీద క్రష్ ఎక్కువగా ఉందని అడిగారు.
దానికి కవిన్ వెంటనే శ్రద్ధ కపూర్ అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత లిప్ లాక్ గురించి కవిన్ మాట్లాడుతూ ఏ హీరోయిన్ అనేది కాదు కథకు అవసరమైతే ఎవరితో అయినా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నానని వెల్లడించాడు. ప్రస్తుతం కవిన్ నయనతారతో సినిమాలో చేస్తున్నాడు. ఒకవేళ ఈ సినిమాలో నయనతార తో లిప్ లాక్ సీన్ ఉంటుందేమోనని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఒక వేళ ఉంటె... దీనికి నయనతార ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాలి.