ప్రస్తుతం అనుష్క ఏజ్ 43 సంవత్సరాలు.. అయితే అనుష్క శెట్టి కి 35 ఏళ్లు ఉన్నప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలిగా అవకాశం వచ్చిందట. అయితే ఎందుకో ఆమె అసలు ఒప్పుకోలేదని సమాచారం. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు డైరెక్టర్ రాఘవేంద్రరావు. యాక్టర్ గా డైరెక్టర్ గా పేరు పొందిన తన కొడుక్కి అనుష్కను ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడట. అయితే ఈ విషయాన్ని అనుష్కకి చెప్పడంతో ఆమె వెంటనే నో అని చెప్పేసిందట.
దీంతో డైరెక్టర్ రాఘవేంద్రరావు తన కుమారుడికి అనిత అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. అయితే వీరిద్దరూ కేవలం మూడేళ్లకే విడిపోయినట్లు సమాచారం. అయితే అప్పట్లో అనుష్క పెళ్లికి ఒప్పుకోకపోవడానికి ఒక స్టార్ హీరోతో ప్రేమాయణం కారణమంటూ పలు రకాలుగా వార్తలైతే వినిపించాయి. మొత్తానికి అనుష్క అభిమానులు కూడా ఆమె పెళ్లి పైన చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజున తన సినిమాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి మరి. ప్రస్తుతం అనుష్క ఏకంగా 14 భాషలలో నటిస్తున్న సినిమా కథనర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఇందులో కూడా చాలా విభిన్నమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.