పుష్ప ది రైజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నార్త్ బెల్ట్ లో సైతం కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్ సక్సెస్ లో పాటలు కీలక పాత్ర పోషించాయి. అయితే పుష్ప ది రైజ్ బీజీఎం విషయంలో మాత్రం కొన్ని విమర్శలు వ్యక్తమయ్యాయి. దేవిశ్రీ నుంచి కోరుకున్న రేంజ్ ఔట్ పుట్ అయితే రాలేదని కామెంట్లు వినిపించాయి. అయితే పుష్ప సీక్వెల్ కు మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయనున్నారని తెలుస్తోంది.
 
థమన్, అజనీష్ లోకనాథ్ ఈ సినిమా బీజీఎం కోసం వర్క్ చేస్తున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. అయితే దేవిశ్రీ కెరీర్ లో తను మ్యూజిక్ అందిస్తే మరో మ్యూజిక్ డైరెక్టర్ బీజీఎం అందించడం ఎప్పుడూ జరగలేదు. దేవిశ్రీ కెరీర్ లో ఇలా జరగడం తొలిసారంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి పుష్ప టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
 
పుష్ప సీక్వెల్ ను సైతం భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తుండగా మరికొన్ని రోజుల్లో ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కానుంది. పుష్ప ది రూల్ ట్రైలర్ విడుదలైతే ఈ సినిమా కథ గురించి ఒక అంచనాకు రావడంతో పాటు సినిమా ఏ విధంగా ఉండనుందో తేలిపోనుంది. పుష్ప ది రూల్ కచ్చితంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాలని అభిమానులు ఫీలవుతున్న సంగతి తెలిసిందే.
 
ఈ ఏడాది విడుదలైన పెద్ద సినిమాలైన గుంటూరు కారం, కల్కి, దేవర సినిమాలు బాక్సాఫిస్ వద్ద హిట్ గా నిలవగా పుష్ప సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ సినిమా బెనిఫిట్ షోలను సైతం రికార్డ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. బన్నీ బాక్సాఫీస్ స్టామినా ఈ సినిమాతో ప్రూవ్ కానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: