సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా హాస్పిటల్ పాలైన సంగతి మనకు తెలిసిందే. ఆయన హార్ట్ కి ఆపరేషన్ చేసి స్టంట్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈయన అనారోగ్యం పాలైన సమయంలో రజినీ అభిమానులు ఆయన పూర్తి ఆయురారోగ్యాలతో బయటపడాలని దేవుడికి ప్రార్థించారు. ఇక అందరూ కోరుకున్నట్టే రజినీకాంత్  ఆరోగ్యంగా బయటపడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన వయసు మీద పడడంతో ఎక్కువగా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు అని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది.అయితే ఇలాంటి వేళ రజినీకాంత్ కి ఉన్న చివరి కోరికను ధనుష్ తీర్చగలడా అంటూ సోషల్ మీడియాలో తమిళ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి ఇంతకీ ఆయన చివరి కోరిక ఏంటయ్యా అంటే.. ధనుష్ ఐశ్వర్యలు మళ్ళీ కలవడం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్ ఐశ్వర్యలు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు.కానీ  విడాకులు ప్రకటించిన ఈ జంట ఇప్పటివరకు అయితే అధికారికంగా విడాకులు తీసుకోలేదు.

రీసెంట్ గా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి హాజరు అవ్వాల్సిన రోజు ఇద్దరూ కోర్టులో హాజరు కాకపోవడంతో వీరిద్దరూ విడాకులను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల ఐశ్వర్య, అలాగే రజినీకాంత్ మీద ఉన్న ప్రేమతో ధనుష్ ఆయన కోరిక మేరకు మళ్ళీ ఒకటవ్వాలని చూస్తున్నారట.అయితే ఇది రజినీకాంత్ చివరి కోరిక అని కూడా తెలుస్తోంది. తన ఇద్దరు కూతుర్లు భర్తలతో పిల్లలతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారట. అయితే చిన్న కూతురు సౌందర్య వైవాహిక జీవితం బాగున్నప్పటికీ పెద్ద కూతురు ఐశ్వర్య మాత్రం భర్తతో విడాకులు తీసుకునే ఆలోచనలో ఉంది.

 కాబట్టి ధనుష్ తో ఐశ్వర్య కలిసిపోయి ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలి అని రజినీకాంత్ కోరుకుంటున్నారట.అయితే రజినీకాంత్ రీసెంట్గా తన అల్లుడు ధనుష్ ని ఇంటికి పిలిపించుకొని మరీ ఈ విషయం చెప్పినట్టు తెలుస్తోంది.ఇక మామ రజినీకాంత్ కోరిక తీర్చడం కోసం ధనుష్ కూడా మళ్లీ ఐశ్వర్యతో కలిసి పోవడానికి సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఉన్నది నిజమేనా..ధనుష్ తన మామయ్య కోరిక తీర్చగలరా.. అనేది సూపర్ స్టార్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న. మరి చూడాలి అందరూ కోరుకుంటున్నట్లు ధనుష్ ఐశ్వర్యలు మళ్ళీ ఒక్కటవుతారో లేదో

మరింత సమాచారం తెలుసుకోండి: