కానీ హీరోయిన్ సాయి పల్లవి మాత్రం డబ్బును అస్సలు లెక్క చేయదు. కథ నచ్చితే ఆ కథ కోసం డబ్బులు లేకుండా కూడా నటిస్తుంది. మరి ముఖ్యంగా తను కధను నమ్మి ఆ సినిమాలో నటిస్తే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తం కూడా వెనక్కి ఇచ్చేస్తుందట . ఇదే విషయం ఒక సినిమాలో ప్రూవ్ అయింది . "పడి పడి లేచే మనసు" సినిమాలో హీరోయిన్గా నటించింది సాయి పల్లవి. ఈ సినిమాలో హీరోగా నటించాడు శర్వానంద్.
ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అప్పట్లో జనాలు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమరైపోయింది. సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అయినా సాయి పల్లవి ఏమాత్రం బాధపడలేదు భయపడలేదు . ఆమె ఈ సినిమాకి నష్టాలు వచ్చాయి అని తెలుసుకొని తాను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేసిందట . తన తల్లి చెప్పిన కారణంగానే ఇలా సాయి పల్లవి చేసిందట . అయితే డైరెక్టర్ సాయి పల్లవి మంచి మనసుకి కన్నీళ్లు కూడా పెట్టుకున్నారట . ఈరోజుల్లో మీలాంటి హీరోయిన్ ఉండటం గ్రేట్. డబ్బు ఇస్తేనే షూటింగ్ కి వస్తామంటూ తెగేసి చెప్పే హీరోయిన్స్ ఉన్న ఈ కాలంలో మీలాంటి మంచి మనసు ఉన్న హీరోయిన్ కూడా మా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా గర్వకారణం అంటూ ఆ సినిమాకి సగం రెమ్యూనరేషన్ ని ఆమెకి మళ్ళీ తిరిగి ఇచ్చేసారట . సాయి పల్లవి మంచితనానికి ఇదే నిదర్శనం అంటున్నారు ఆమె అభిమానులు..!