టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో మార్కెట్ ఉన్న హీరోలలో నిఖిల్ ఒకరనే సంగతి తెలిసిందే. నిఖిల్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో స్వామిరారా, కేశవ సినిమాలు తెరకెక్కగా స్వామిరారా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే కేశవ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే సుధీర్ వర్మ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.
 
సుధీర్ వర్మ గత సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలవడంతో పాటు ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసిందనే సంగతి తెలిసిందే. అయితే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాకు ప్రమోషన్స్ సరిపోలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదలవుతున్నా బుకింగ్స్ మాత్రం ఆశించిన రేంజ్ లో లేవు.
 
సాధారణంగా క్రేజ్ ఉన్న చిన్న హీరోల సినిమాలకు సైతం ఏఎంబీ సినిమాస్, ఏఏఏ సినిమాస్ లో బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతాయి. అయితే ఈ సినిమాకు మాత్రం బుకింగ్స్ మరీ దారుణంగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిఖిల్ సినిమాలకు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. నిఖిల్, సుధీర్ వర్మ ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచాల్సి ఉంది.
 
నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమాపై మాత్రం భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాకు క్రిటిక్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. నిఖిల్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. హీరో  నిఖిల్ పారితోషికం ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.


 


మరింత సమాచారం తెలుసుకోండి: