ఏ రంగంలోనైనా సరే ఎక్కువకాలం రాణించాలి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరు నిజాయితీతో పని చేయాలని అప్పుడే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడతామని తెలిపింది. సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చే సమయంలో కొందరు అవగాహన లేక మెలకువలు తెలుసుకోలేక ఫెయిల్యూర్ అయిన వారు ఉంటారని.. ఇండస్ట్రీలో నిత్య విద్యార్థిగానే మెలగాలి అంటూ తెలిపింది అనుష్క. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడు మానసికంగా దృఢంగా సిద్ధమయ్యే ఉండాలని తెలిపింది.. ముఖ్యంగా యోగ, వ్యాయామం వంటివి కచ్చితంగా చేయాలి అని వీటిని చేశామంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటామంటూ తెలిపింది అనుష్క.
కొంతమంది మన ప్రమేయం లేకుండానే మన విజయంలో భాగమవుతారు వారు లేకపోతే సక్సెస్ ఉండదు అందుకు కృతజ్ఞతతో కచ్చితంగా ఉండాలని తెలిపారు. జీవితం ఎవరికి ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేము అందుకే వేటికైనా సరే సిద్ధపడి ఉండాలి.. మొదట వైద్యురాలిగా కావాలనుకున్నాను కానీ చివరికి నటిగా మారానుంటు తెలిపింది అనుష్క.. ఖాళీ సమయాలలో ఎక్కువగా తల్లిదండ్రుల దగ్గర సమయాన్ని గడపడం వల్ల మరింత ధైర్యం వస్తుంది అంటూ తెలిపింది అనుష్క. ఇతరుల లాగా ఎప్పుడూ ఉండాలని ఆలోచించకూడదు ఎవరి ప్రతిభ వారిదే రంగం ఏదైనా సరే మన మార్కు చూపించుకునేలా ముందుకు సాగాలి అంటూ తెలిపింది అనుష్క. ఇతరులు మనతో ఎలా ఉండాలనుకుంటున్నారో వారితో మనం అలాగే వ్యవహరించాలి అంటూ తెలిపింది.