పలు వెబ్ సిరీస్లను అదే విధంగా పలు సినిమాలను ఆయన స్ట్రాటజీలతో నిర్మిస్తూ ఉంటారు . కాగా మరికొద్ది రోజుల్లోనే అల్లు అరవింద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన "తండేల్" మూవీ రిలీజ్ కాబోతుంది . నిజానికి ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ కావాలి. కానీ కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాను ఫిబ్రవరి 7 కి పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ విషయాన్ని కన్ఫామ్ చేసింది చిత్ర బృందం . కాగా ఈ ప్రెస్ మీట్ ని చాలా సింపుల్ గా నిర్వహిస్తారు అని అంతా అనుకున్నారు . కానీ ఒక ఈవెంట్ లా పెట్టాడు అల్లు అరవింద్ . ఇదే విషయాన్ని సాయి పల్లవి కూడా స్టేజిపై చెప్పుకు వచ్చింది .
అయితే ఈ ఈవెంట్ లో సాయి పల్లవి - చైతన్య స్పీచ్ తర్వాత మీడియా మిత్రులకు ప్రశ్నించే ఛాన్స్ ఇచ్చారు అల్లు అరవింద్. అయితే వాళ్ళ స్పీచ్ అయిపోయిన వెంటనే చైతన్యను అదేవిధంగా సాయి పల్లవిను ఎస్కేప్ చేసేసాడు అల్లు అరవింద్. ఈ సినిమాకి సంబంధించిన హీరో హీరోయిన్ ఉంటేనే కదా ఎక్కువ ప్రశ్నలు వేస్తారు..? ఆ సినిమాకి ఇంకా పబ్లిసిటీ వస్తుంది.. కానీ అల్లు అరవింద్ ఎక్కడ నాగచైతన్య - సమంతల డివోర్స్ ,శోభితతో పెళ్ళి మేటర్ హైలెట్ అవుతుందో అన్న భయంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సాయిపల్లవిని అదే విధంగా నాగచైతన్యను ఈ ప్రెస్ మీట్ లో క్వశ్చన్స్ సెక్షన్ నుంచి ఎస్కేప్ చేశారట. సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అరవింద్ తెలివితేటలను తెగ పొగడేస్తున్నారు జనాలు..!