తెలుగు సినిమా ప్రేమికులందరికీ తెలిసిన విషయమే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన "రోజా" చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం చిత్రానికి మరో ఆకర్షణగా నిలిచింది. కానీ ఈ చిత్రానికి మొదట సంగీత దర్శకుడిగా ఎంపిక చేయబడింది రెహమాన్ కాదని తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా...రోజా చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిరత్నం మొదట ఎంపిక చేసినది ఏ.ఆర్. రెహమాన్ కాదు. ఆయన మనసులో మరొకరు ఉన్నారట. కాగా మణిరత్నం దర్శకత్వం వహించిన మాస్టర్ పీస్ చిత్రాలలో రోజా ఒకటి. 

1992లో విడుదలైన ఈ చిత్రాన్ని కె.బాలచందర్ నిర్మించారు. తమిళ సినిమాకే ఈ సినిమా ఒక మలుపు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు వరకు ఇళయరాజా కోలీవుడ్‌లో ఆధిపత్యం చెలాయించారు. ఆయన హవా నడిచింది. ఆ సమయంలోనే రోజా, ఏ.ఆర్.రెహమాన్ అనే కొత్తవారిని పరిచయం చేశారు. ఇక నిర్మాత ఆయనని ఈ సినిమాలో సంగీతం కోసం ఫిక్స్ చేశారు. సినిమా నిర్మాత అయిన కె.బాలచందర్  తీసుకున్న ఈ నిర్ణయం తమిళ సినిమా రూపురేఖలనే మార్చేసింది. అప్పటివరకు ఇళయరాజానే నమ్ముకున్న వారికి ఏ.ఆర్.రెహమాన్ అనే కొత్త సంగీత నాయకుడిని అందించింది రోజా సినిమా.  

మొదటి సినిమాలోనే తన ప్రతిభను చూపించిన రెహమాన్ ఆ సినిమా పాటలతో మ్యాజిక్ చేశారు. దానికి ఆయనకు జాతీయ అవార్డు  బహుమతి వచ్చింది. ఇళయరాజాకు ఒక్క ఓటు తేడాతో ఓడించి జాతీయ అవార్డును గెలుచుకున్నారు రెహమాన్. "రోజా" చిత్రం తరువాత రెహమాన్ అనేక సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం అందించి భారతీయ సంగీత దిగ్గజంగా ఎదిగారు."రోజా" చిత్రం కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు. తమిళనాడులో జరిగిన రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలోని సంగీతం, నటీనటుల అద్భుతమైన నటన, కథలోని ఉద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలై భారీ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: