అయితే ఆ సమయంలో ఆమె భర్త నిర్మాత (సాజిద్) పైన పలు రకాల ఆరోపణలు అయితే వినిపించాయి. అయితే సాజిద్ నిందితుడు కాదంటూ బాలీవుడ్ నటుడు గుడ్డి మారుతి మాత్రం పలు విషయాలను తెలియజేశారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దివ్యభారతి చాలా మంచి అమ్మాయి తాను ఎప్పుడు రెస్ట్లెస్ గానే ఉండేదని తన జీవితంలోని ప్రతి రోజు కూడా ఇదే చివరి రోజు అన్నట్లుగా ఎంజాయ్ చేసేదని తెలిపారు. తన సినిమా షూటింగ్ షోలా ఔర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 5న మరణించింది అంటూ తెలిపింది.
అలాగే ఏప్రిల్ 4న తన పుట్టినరోజు కావడం చేత దివ్య, సాజిద్, గోవిందాతో పాటుగా మరి కొంతమంది ఈ పార్టీలో పాల్గొన్నారు.. దివ్యభారతి కూడా ఈ పార్టీలో అందరితో మాట్లాడుతున్న తాను చాలా ఎందుకో బాధపడుతున్నట్టు కనిపించిందని..ఉదయాన్నే షూటింగ్ ఉన్న ఆమె వెళ్లడానికి ఇష్టపడలేదని తెలిపారు. అయితే తాను ఆకలేసి తిందామని కిందికి వెళ్ళగా.. తనని పైనుంచి ఎవరో పిలిచినట్టుగా అనిపించి వెళ్లి చూశానని అక్కడ దివ్యభారతి బాల్కనీలో కూర్చొని కనిపించిందని తెలిపారు.. అంతేకాకుండా అక్కడ కూర్చోవడం సేఫ్ కాదని చెప్పిన.. తనకు ఇలాంటి ప్రదేశాలు భయం లేదని చెప్పిందట.. తన భర్త కారు వచ్చిందా లేదా అని తొంగి చూస్తున్న సమయంలో ఆమె కింద పడి మరణించింది అంటూ తెలియజేశారు గుడ్డీ మారుతి. ఈ సంఘటన డిజైనర్ నీతాలుల్లా కూడా చూశారని దివ్యభారతి మరణం మాత్రం తన తల్లి జీర్ణించుకోలేకపోయిందని అలాగే సాజిత్ కూడా చాలా దుఃఖంలో మునిగిపోయారని తెలిపారు గుడ్డి మారుతి..