అదేదో సామెత లాగా .."రాను రాను రాజు గారి కుర్రం గాడిద అయ్యింది అన్నట్లు "..చాలా చక్కగా అందంగా ఇండస్ట్రీ ని ఏలేసే అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ కీర్తి సురేష్ ఇంత దారుణంగా దరిద్రంగా తయారయింది ఏంటి అంటూ ట్రోలింగ్ కి గురి అవుతుంది . అలాగే బాగా ట్రోల్ చేస్తున్నారు జనాలు.  మనకు తెలిసిందే కీర్తి సురేష్ అంటే ఓ మహానటిగానే గుర్తిస్తారు జనాలు. మరీ ముఖ్యంగా ఆమె అందం అలాంటిది.  అలాంటి కీర్తి సురేష్ లుక్స్ టోటల్గా మారిపోయాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో అంటూ కంగారు పడకండి . ఇది హీరోయిన్ కీర్తి సురేష్ .


ఇలా మారిపోయింది కీర్తి సురేష్ ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించింది . అన్ని లుక్స్ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి . అయితే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో "బేబీ జాన్" అనే సినిమాతో ఎంట్రీ ఇస్తుంది . దీనికి సంబంధించి కీర్తి సురేష్ టేస్టర్ కట్ రివిల్ అయింది . అయితే ఇందులో ఈమె లుక్  చూసి తెలుగు అలాగే హిందీ ప్రేక్షకులు అందరూ షాక్ అయిపోతున్నారు . కీర్తి సురేష్ ఏంటి ఇలా మారిపోయింది అంటుంటే ..మరికొందరు ఈమె కీయరా అద్వానిలా ఉందే అంటూ మాట్లాడుకుంటున్నారు .



మరి ముఖ్యంగా హీరోయిన్ కి ఆమె గుర్తింపు కాకుండా మరో హీరోయిన్ ని అలా అనిపించడం అంటే ఒకింత అవమానం అనే చెప్పుకోవాలి.  అసలు ఎందుకు కీర్తి సురేష్ ఇలాంటి లుక్స్ ని ఓకే చేసింది ..? ఒకప్పుడు మహానటి సావిత్రి గారిని రిప్రెజెంట్ చేసిన కీర్తి సురేష్ .. ఇప్పుడు ఇలాంటి చెత్త లుక్స్ లో దర్శనం ఇవ్వడం ఫ్యాన్స్ కి కూడా మింగుడు పడడం లేదు. ఇప్పటికే సరైన హిట్స్ లేక అల్లాడిపోతుంది కీర్తి సురేష్ . ఇక ఆమె మొదటిగా నటిస్తున్న సినిమాకి ఇలాంటి ఫీడ్ బ్యాక్ రావడంతో ఆమె కెరియర్ టెన్షన్లో పడ్డట్టే అంటున్నారు సినీ విశ్లేషకులు. చూద్దాం ఇక నైన కీర్తి సురేష్ లుక్స్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు ఏమో మూవీ మేకర్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: