సాధారణంగా స్టార్ హీరోల డేట్స్ కోసం డైరెక్టర్లు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ డైరెక్టర్ డేట్స్ కోసం స్టార్ హీరోలు వెయిట్ చేయడం ఎప్పుడైనా చూసారా. కానీ ఇలాంటి పరిస్థితిని ఇండస్ట్రీలో తీసుకోవచ్చాడు పూరి జగన్నాథ్. తన దర్శకత్వ ప్రతిభతో హీరోలు అందరూ చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఒక్కసారైనా పూరితో ఒక సినిమా చేస్తే చాలు సూపర్ హిట్ కొట్టవచ్చు అనే రేంజ్ కు వెళ్లిపోయాడు.  మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి హీరోలను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసింది కూడా పూరి జగన్నాథ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 సాఫ్ట్ గా లవర్ బాయ్ లా కనిపించిన స్టార్ హీరోలను మాస్ ఓరియంటెడ్ పాత్రల్లో చూపించే వారిలోనే కొత్త ట్రాక్ ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాంటి పూరీ జగన్నాథ్ గత కొంతకాలం నుంచి మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో ఒకప్పుడు పూరి జగన్నాథ్ తో ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్న స్టార్ హీరోలే.. ఇక ఇప్పుడు ఆయనకు డేట్స్ ఇవ్వాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. స్టార్ హీరోలే కాదు మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరితో సినిమా అంటే వెనకడుగు వేస్తున్నారు.



 ఇలా ఒకప్పుడు ఎంతోమంది లవర్ బాయ్ లాంటి హీరోలను మాస్ హీరోలుగా మార్చిన పూరి జగన్నాథ్ ఇక ఇప్పుడు ఏకంగా ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేయబోతున్నాడట. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో స్పిరిట్ అనే మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీకి పూరి అసిస్టెంట్ గా ఉండబోతున్నాడట. ఈ సినిమాకు పూరి మాటల రచయితగా కూడా పని చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ మూవీ డైలాగ్ ల బాధ్యతలను పూరి జగన్నాథ్ కు అప్పగించాడట సందీప్. ఒకప్పుడు ఇదే ప్రభాస్ తో బుజ్జిగాడు ఏక్ నిరంజన్ తీసిన పూరి ఇక ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మాటల రచయితగా అసిస్టెంట్ గా ఉండబోతున్నాడు అని తెలిసి అభిమానులు సైతం జాలి పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: