సౌత్ ఇండియాలోనే స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న సుమ దాదాపు ఈ జనరేషన్ వారందరికీ చిన్నతనం నుంచి బాగా తెలుసు.. దాదాపు  మూడు దశాబ్దాలుగా యాంకరింగ్ రంగంలో తనదైన మార్క్ వేసింది.. సుమా చిత్ర పరిశ్రమలో కూడా 30 ఏళ్లకు పైగానే ఉంటుంది. ఇక ఆమె యాంకర్ గా ఉన్న సమయంలోనే పదుల సంఖ్యలు యాంకర్స్  వచ్చారు స్టార్‌డం అనుభవించారు రిటైర్ అయ్యి పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. కొంత మంది అసలు ఎక్కడ కనిపించకుండా మాయమైపోయారు. అయినా వయసు పెరుగుతున్న సుమ డిమాండ్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. యాంకరింగ్ లో స్టార్లు, సూపర్ స్టార్లు, మెగాస్టార్లు ఇలా ఏవన్నా అవన్నీ సుమకే వర్తిస్తాయి .. ఎందుకంటే ఇప్పటికీ పెద్ద ఈవెంట్ ఏదైనా సరే సుమనే వెతుక్కుంటూ వస్తున్నారు. ఎలాంటి పేపర్ చూడకుండా స్పాంటినియస్ గా స్పందిస్తూ స్థాయిని బట్టి స్టార్లపై కూడా కాస్త అటు ఇటుగా ఫీల్ అవ్వకుండా పంచులు వేస్తూ అద్భుతంగా హోస్టింగ్ చేస్తుంది సుమ.


ఏ కార్యక్రమానికైనా నిండుదనాన్ని అద్భుతమైన విజయాన్ని అందించడంలో సుమ పాత్ర ఎక్కువగా ఉంటుంది.. టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలకు పెద్దగా ఆఫర్లు లేకపోయినా సుమ ఈవెంట్లు మాత్రం మూడు పూవులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది.. అయితే సుమకు ఇప్పటికే 50 ఏళ్లు వచ్చేసాయి అయినా కూడా ఏమాత్రం తగ్గని అందంతో దూసుకుపోతుంది ఇంకో పదేళ్లు యాంకరింగ్లో నేనే స్టార్ను అని కూడా అంటుంది. అయితే తర్వాత ఆమె పరిస్థితి ఏంటి బాగా ముసలి అయిన తర్వాత సుమ ఏం చేస్తుంది.. ఇన్ని సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాం కదా రెస్ట్ తీసుకోవటమే అని రిటైర్ అవుతుందా లేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంద‌ అనే ఈ విషయాల్లో సుమ క్లారిటీ ఇవ్వలేదు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయాలపై స్పందించారు. సుమా భర్త‌ రాజీవ్ కనకాల - ఎన్టీఆర్ ఎంతో గొప్ప స్నేహితులు.. అలాగే సుమతో కూడా ఎన్టీఆర్‌కు ఎంతో చనువుంది. వీరిద్దరూ సినిమా ఈవెంట్లు కూడా ఒక్కరిపై ఒకరు పంచులు వేసుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే త్రిబుల్ ఆర్ మూవీ ప్రమోషన్స్‌లో సుమ విషయం వారికి చర్చికి వచ్చింది. సుమా దాదాపు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ అన్ని భాషలు మాట్లాడగలదు యాంకర్ కాబట్టి ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉంది.


నేను కన్నాంబ, కాంచనమాల కాలం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను స్టేజ్ పైన అని సుమా సరదాగా అంది. అప్పుడు ఎన్టీఆర్ కలగజేసుకుని మొన్న కీరవాణి గారితో ఇంటర్వ్యూ అప్పుడు ఈ విషయమే మాట్లాడుకున్నాము రిటైర్ అయ్యాక ఏం చేస్తుందంటే సూర్యకాంతం, ఛాయాదేవి ,నెరలమ్మ లాంటి నోరు వేసుకుని పడిపోయి అత్త పాత్రలు చేస్తుంది ఆవే సుమ‌కు కరెక్ట్ గా సెట్ అవుతాయి రాజీవ్ కూడా ఉంటాడు. రేలంగి లాగా నోరు పడిపోయి.. బార్య చేతిలో కీలుబొమ్మ లాంటి మొగుడు పాత్రలు చేస్తాడు..  అంటూ ఎన్టీఆర్ సుమ ఫ్యూచర్ లో ఏం చేయాలో చెప్పేశాడు. దాంతో ఇంటర్వ్యూలో నవ్వులు పూశాయి. నిజంగా ఎన్టీఆర్ చెప్పిన్నట్టుగా సుమ ఏజ్ బార్ అయిన తరువాత రాజీవ్ తో కలిసి అలాంటి పాత్రలు చేస్తే బాగుంటుంది అని నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇక మ‌రి సుమ రీటైర్ అయిన త‌ర్వాత ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: