అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ఆగస్టు 8వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో సీక్రెట్ గా వారి ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఇక వీరి వివాహం తొందరలోనే జరిపించాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో ఉన్నారట. ఇక చైతన్య శోభిత, ఎంగేజ్మెంట్ సింపుల్ గా జరిపించినందువల్ల వీరి వివాహాన్ని విదేశాలలో చేయాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా చాలా గ్రాండ్గా జరిపించాలని ప్లాన్ చేస్తున్నారట. కాగా, నటి శోభిత, నాగచైతన్య చాలా సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు.


వీరి రిలేషన్ చాలా సీక్రెట్ గా కొనసాగించి కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం జరుపుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఎన్నోసార్లు బయటకు వచ్చినప్పటికీ చైతు కానీ శోభిత కానీ రియాక్ట్ అవలేదు. చాలాసార్లు వీరు బయట కలుసుకుంటూ కెమెరా కంట కూడా పడ్డారు. అయినప్పటికీ వీరి ప్రేమ విషయం చాలా గోప్యంగా ఉంచారు.  చివరికి ఈ జంట ఎంగేజ్మెంట్ జరుపుకొని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారు. ఇప్పటికే చైతు, శోభిత వివాహానికి సంబంధించిన పనులను కుటుంబ సభ్యులు జరుపుతున్నారట. కాగా, వీరి వివాహాన్ని అక్కినేని నాగార్జున రష్యాలో చాలా గ్రాండ్గా జరిపించాలని ప్లాన్ లో ఉన్నారట.


కానీ చైతన్య మాత్రం ఇండియాలోనే చాలా సింపుల్గా వివాహం చేసుకుంటానని చెబుతున్నాడట. ఈ విషయం వల్లనే తరచూ అక్కినేని కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయట. రష్యాలో వివాహం జరిపించి ఇండియాలో రిసెప్షన్ చేయాలని అక్కినేని నాగార్జున అనుకుంటున్నప్పటికీ నాగచైతన్య దీనికి అసలు ఒప్పుకోవడం లేదట. ఎందరు చెప్పినా కూడా నాగచైతన్య ఇక్కడే వివాహం, రిసెప్షన్ చేసుకుంటానని చెబుతున్నాడట. ఇక వీరి వివాహం ఎక్కడ జరుగుతుందో చూడాలి.


ఇదిలా ఉండగా..... నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా చేస్తోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 7, 2025న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం నాగచైతన్య అభిమానులు, అటు సాయి పల్లవి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: