ఇటీవల సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన బుల్లితెర జంటలలో మలయాళ బుల్లితెర నటుడు క్రిష్ వేణుగోపాల్ - నటి దివ్య శ్రీధర్ పెళ్లి చాలా హైలెట్. ఇటీవల వీరిద్దరు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జంట పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు వీరిని తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లి ఏంటని విమర్శిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ రోజుల్లో బట్టతల... బయటకు తన్నుకు వచ్చిన.. పొట్ట కామన్ అయిపోయింది. కానీ.. పెళ్లి చేసుకునే వరకు అయినా ఆ రెండిటిని కవర్ చేసుకోవాలని ప్రయత్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వేణుగోపాల్‌ మాత్రం మెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నారు.


ముసలాడిలాగానే పెళ్లి పీటలపై కూర్చుని తన ప్రేయసి మెడలో మూడు ముళ్ళు వేశాడు. తన పిల్లల ఎదుట రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో సహజంగా సోషల్ మీడియాలో వీరిని ఒక ఆట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీ‌ధ‌ర్‌ స్పందించి తమ వయసు మరీ ఎక్కువ కాదని పెదవిపింది. తన వయసు 40 సంవత్సరాలు అని.. క్రిష్ వయసు 49 సంవత్సరాలు అని పేర్కొంది. తము శారీరిక వాంచ‌ కోసం పెళ్లి చేసుకోలేదని.. ఒకరికి ఒకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది. ఇక వేణుగోపాల్‌ మాట్లాడుతూ తాను మొదటి భార్యతో సంతోషంగా లేనని.. ఆమె తన స్వేచ్ఛను దూరం చేసింది.. నా కుటుంబంతో కూడా మాట్లాడించేది కాదు.. ఎన్నో షరతుల విధించింది.


ఎవరు మా ఇంటికి కూడా వచ్చేవారు కాదు.. కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు ఒప్పుకునేది కాదు.. నన్ను ఒక మనిషిలా కాకుండా పెంపుడు జంతువులా చూసేదని.. అందుకే జీవితంపై విరక్తితో విడాకులు ఇచ్చేసానని తెలిపాడు. 2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో విడాకులు వచ్చాయని.. కొన్ని నెలలపాటు ఏ తోడు లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను రెండో పెళ్లి చేసుకున్నాను అని తెలిపారు. మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందని చెప్పారు. ఇక వేణుగోపాల్ బుల్లితెరపై పలు సీరియల్స్‌లో తాతగా నటించాడు. కొన్ని మలయాళ సినిమాలలో కూడా నటించి బాగా పాపులర్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: