బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యరాయ్ కూడా ఉంటారు. వీరిద్దరూ ఎవరికి వారు అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ప్రేమించి ఇరు వైపుల పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా , సరదాగా ముందుకు సాగింది. పెళ్లి అయిన చాలా సంవత్సరాల తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి , ప్రస్తుతం వీరు ఎవరికి వారు విడిగా జీవిస్తున్నారు. మరి కొంత కాలంలోనే వీరు విడిపోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అని అనేక వార్తలు ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా వార్తలు రావడంతో అభిషేక్ , ఐశ్వర్య అభిమానులు కూడా నిరుత్సాహ పడుతున్నారు. వారికి తాజాగా వైరల్ అవుతున్న ఓ వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. అసలు ఏమిటా వార్త అనే వివరాలను తెలుసుకుందాం.

గతంలో అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్య రాయి ఇద్దరు కలిసి పలు సినిమాలలో నటించిన విషయం మనకు తెలిసిందే. వీరిద్దరూ విడిపోతున్నారు అని వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలోనే వీరి మరో సినిమా కూడా కలిసి చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. గతంలోనే మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గురు సినిమాలో అభిషేక్ , ఐశ్వర్య కలిసిన నటించారు. ఈ సినిమా వీరి వివాహం ముందు విడుదల అయింది. ఇక మరోసారి మణిరత్నం వీరిద్దరితో ఓ సినిమాను రూపొందించబోతున్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మణిరత్నం వీరిద్దరితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు అని తెలియడంతో గత కొన్ని రోజులుగా వీరు విడిపోబోతున్నారు అని వస్తున్న వార్తలు అన్ని పూర్తిగా అవాస్తవం చాలా మంది భావిస్తున్నారు. దానితో అభిషేక్ , ఐశ్వర్య అభిమానులు చాలా ఆనంద పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: