జాన్వి కపూర్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తోంది. తెలుగులో దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది భారీ విజయాన్ని సొంతం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అంతేకాకుండా తమిళంలో సూపర్ హిట్ అయిన ఈరం (వైశాలి) సినిమా హిందీ రీమేక్ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ఛాన్స్ కొట్టేసింది.


2009లో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమాను డైరెక్టర్ శంకర్ నిర్మించారు. అరివలగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే తాజాగా బాలీవుడ్ నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హైదరాబాద్ కు రావడం జరిగింది. మొదట ఈ బ్యూటీ హైదరాబాద్ కు వచ్చిన వెంటనే అందరూ ఏదైనా సినిమా షూటింగ్ కోసమని అనుకున్నారు. కానీ ఆ తర్వాత తెలిసింది జాన్వీ కపూర్ హైదరాబాద్ కి వచ్చింది పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసమని.


అమీర్పేట్ పరిధిలొని మధుర నగర్ లో పూజలు చేయడానికి ముంబై నుంచి హైదరాబాద్ కి ఈ బ్యూటీ వచ్చింది. అమీర్పేట్ సమీపంలోని హనుమాన్ దేవాలయంలో జాన్వి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఆలయ అర్చకులు జాన్వీకపూర్ కు పూజా కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. జాన్వి కపూర్ కి మొదటి నుంచి దేవుళ్ళు అంటే పరమభక్తి. అందుకే ఆమె ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి పూజలో పాల్గొన్నారు.


మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎందుకు వచ్చారు అనేది మాత్రం తెలియడం లేదు. కానీ జాన్వి పూజలో పాల్గొని మాత్రం తన ప్రియుడు కోసమే అని అంటున్నారు. తన ప్రియుడు క్షేమం కోసమే జాన్వికపూర్ ప్రత్యేక పూజలు నిర్వహించిందని సమాచారం అందుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: