నందమూరి కళ్యాణ్ రామ్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి క్రమం తప్పకుండా సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. తాజాగా అదే బ్యానర్ పై జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కళ్యాణ్ రామ్ తన బ్యానర్ ద్వారా ఎంతో మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. అయితే ఒక దర్శకుడు మాత్రం కళ్యాణ్ రామ్‌కు తీరని ద్రోహం చేశారని చెప్పాలి. ఆదర్శకుడు ఎవరో ? కాదు సురేందర్ రెడ్డి. అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డిని వెండితెరకు దర్శకుడిగా పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ఆ సినిమా రవితేజ బ్లాక్ బస్టర్ భద్ర సినిమాకు పోటీగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత సురేందర్ రెడ్డి స్టార్ డైరెక్టర్ అయిపోయారు.
తనకు దర్శకుడుగా అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ రుణం మాత్రం తీర్చుకోలేకపోయారని చెప్పాలి. తన సోదరుడికి అతనొక్కడే ఇలాంటి హిట్ సినిమా ఇచ్చాడని నమ్మి జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి - అశోక్ లాంటి రెండు సినిమాలకు అవకాశం ఇస్తే రెండు సినిమాలు డిజాస్టర్ చేసి వదిలిపెట్టాడు. మహేష్ బాబు అతిధి సినిమాతో అవకాశం ఇస్తే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. రీసెంట్గా అఖిల్ ఏజెంట్ లాంటి భారీ బడ్జెట్ సినిమాకు అవకాశం ఇస్తే ఆ సినిమా అతిపెద్ద డిజాస్టర్ రావడంతో పాటు అఖిల పరువు మొత్తం తీసి రోడ్డున పడేసింది.
చివరకు కళ్యాణ్ రామ్ మరోసారి తన బ్యానర్లో సురేందర్ రెడ్డికి కిక్ 2 సినిమాతో అవకాశం ఇచ్చారు. రవితేజ హీరోగా తెరకెక్కిన కిట్టు సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. తనకు డైరెక్టర్గా లైఫ్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ బ్యానర్లో మంచి సినిమా చేసి పెట్టమని అడిగితే సురేందర్ రెడ్డి కిక్ 2 లాంటి పెద్ద డిజాస్టర్ చేసి కళ్యాణ్ రామ్‌ను నష్టాల్లో నిలువునా ముంచేశాడు. చివరకు కళ్యాణ్ రామ్ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయాడు. అయితే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ లాంటి సినిమా తక్కువ బడ్జెట్లో ఫ్రీగా చేసి పెట్టి కళ్యాణ్ రామ్‌ను నష్టాల నుంచి గట్టెక్కెలా చేశారు. ఏది ఏమైనా సురేందర్ రెడ్డి మాత్రం కళ్యాణ్ రామ్ కు న్యాయం చేయలేదని చెప్పాలి.