కాలేజీ మ్యాగజైన్ కోసం రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయాల ని ఆమె అనుకున్నారు .. తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారు . ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యే లోపో రజినీకాంత్ తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు .. నువ్వంటే నాకు ఇష్టం నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని అక్కడే అడిగేసారట . అయితే ఈ ఊహించని సంఘటన కు లతా ఒక్కసారి గా షాక్ అయ్యారట . ఇప్పుడు చెప్పలేను మా ఇంట్లో పెద్ద వాళ్ళ ని అడిగి చెపుతాను అని చెప్పి ఆమె అక్కడ నుంచి వెళ్లిపోయారట .
అలాగే లతా పేరెంట్స్ కూడా పెళ్లి కి ఒప్పుకున్నారు 1981 ఫిబ్రవరి 24 న వీరి పెళ్లి జరిగింది . అలాగే పెళ్లయిన రెండు వారాల కి చిత్ర ప్రముఖుల కోసం వెడ్డింగ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు . ఆ రోజుల్లో చెన్నై నగరం లో లగ్జరీ హోటల్స్ లో ఒకటైన తాజ్ కోరమండల్ లో రజనీకాంత్ లతా వెడ్డింగ్ రిసెప్షన్ అయింది ... ఈ వేడుక కి సెలబ్రిటీలు వచ్చారు .. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది . రజినీకాంత్ లత ఫోటోల తో పాటు హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే అందులో వుంది .