ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో ఏ స్టార్ హీరో పూరితో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే ఛాన్స్ లేదు .. అలాగే టైర్ 2 హీరోలు సైతం పూరితో సినిమా చేసే రిస్క్ తీసుకునే అవకాశం కూడా ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాకుండా పూరి ఇంకా పాత ఫార్మేట్ లోనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అందుకే ఆయన చేసిన సినిమాలు వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాయి. ఈ కారణంగా హీరోలను వెతుక్కునే పరిస్థితి పూరి జగన్నాథ్ కు ఏర్పడింది. మరి ఇలాంటి సమయంలో పూరికి ఆప్షన్ ఎవరు? అంటే టాలీవుడ్ లో మాత్రం ఇప్పుడు ఓ హీరో పేరు గట్టిగా వినిపిస్తుంది. ఇంతకి ఆ హీరో మరెవరో కాదు యంగ్ హీరో సందీప్ కిషన్. ఇక సందీప్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశాడు.. కాని హీరోగా తన కెరీర్ కు ఉపయోగపడే విధంగా సరైన హిట్ మాత్రం పడలేదు.
ఈ నేపథ్యంలో వారిద్దరినీ కలపడానికి పూరీ స్నేహితుడు సందీప్ కిషన్ మేనమామ శ్యామ్.కె. నాయుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా సెట్ చేస్తున్నాడుట. పూరి సరైన కథ రాస్తే కటౌట్ అవసరం లేదు. అతడి కథే హీరోగా మారిపోతుంది. ఇండస్ట్రీకి వారసులను పరిచయం చేసి స్టార్ డమ్ అందించిన ఘనత అతని సొంతం. హీరోలకు మాస్ ఇమేజ్ ఇవ్వడంలోనూ పూరీ తర్వాతే ఎవరైనా. అందుకే శ్యామ్. కె. నాయుడు ఇప్పుడు మేనల్లుడు కోసం పూరిని రంగంలోకి దించుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. పైగా పూరి-శ్యామ్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి చాలా సినిమాలు చేశారు. అంతేకాకుండా మొన్నటి వరకు అక్కినేని హీరో అఖిలతో పూరి ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు సందీప్ కిషన్ తోపురి సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మరి పూరి తన తర్వాతే సినిమాని ఈ ఇద్దరిలో ఏ హీరోతో మొదలుపెట్టి ఈసారైనా ట్రాక్‌లోకి వస్తాడో లేదో చూడాలి.