సౌత్ ఇండస్ట్రీలో నటి అభినయ అంటే తెలియని వారు ఉండరు.ఈమె హీరోయిన్లకు మించిన అందంతో ఎంతో సాంప్రదాయంగా ఉంటుంది.అయితే అలాంటి అభినయ కి మాటలు రావు అంటే ఎవరు నమ్మరు.ఎందుకంటే ఆమె సినిమాల్లో నటన చూసిన ఎవరూ కూడా ఆమె మూగ చెవుడు అంటే అస్సలు నమ్మలేరు.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాల్లో స్టార్ హీరోలకు చెల్లి పాత్రల్లో చేసింది.అలా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో వెంకటేష్,మహేష్ ల చెల్లెలుగా నటించింది. ఈ సినిమానే కాదు చాలా సినిమాల్లో అభినయ నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై గత కొద్ది సంవత్సరాల నుండి విశాల్ ని పెళ్లి చేసుకోబోతుంది అనే రూమర్ వినిపిస్తోంది. విశాల్ అభినయ కాంబోలో మార్క్ ఆంటోనీ సినిమా వచ్చింది. అయితే ఈ సినిమాలో విశాల్ భార్యగా అభినయ చేసింది.

అయితే ఈ సినిమా మాత్రమే కాదు పూజ సినిమాలో కూడా విశాల్ మరదలి పాత్రలో అభినయ నటించింది. అలా కొన్ని సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించడంతో విశాల్ అభినయ పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు ఇండస్ట్రీలో గుప్పుమన్నాయి.అయితే ఈ వార్తలపై చాలాసార్లు అభినయ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చింది అభినయ.నటి అభినయ తన తండ్రితో కలిసి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పింది.నేను మార్క్ ఆంటోనీ సినిమాలో చేసిన సమయంలో విశాల్ తో ప్రేమలో పడి ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.

అయితే నాకు 14,15 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుండే విశాల్ సినిమాలు చూసే అలవాటు ఉంది. విశాల్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. నేను ఆయనకు పెద్ద అభిమానిని. ఎన్నోసార్లు ఆయన్ని ఒక్కసారి కలిస్తే బాగుండు అనిపించేది.కాని మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయన సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ టైంలో నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది.విశాల్ ఎంతో పెద్ద హీరో కానీ షూటింగ్ అయిపోయాక మాతోనే కలిసి కూర్చొని తినేవారు.ఆ టైంలో ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇక విశాల్ తో పెళ్ళంటూ వార్తలు రావడం నాకు షాకింగ్ గా అనిపించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ అభినయ మరోసారి క్లారిటీ ఇచ్చింది

మరింత సమాచారం తెలుసుకోండి: