టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తరువాత ఆ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టేకింగ్ తో అర్జున్ రెడ్డిని మలిచిన విధానం ప్రతి ప్రేక్షకుడిని ఎంతగానో ఆకర్షించింది. రొట్ట కథలు, స్క్రీన్ ప్లే తో బోర్ కొట్టిస్తున్న చాలా మంది దర్శకులు సందీప్ రెడ్డి లా ఆలోచించాలని చాలా మంది ప్రేక్షకులు కామెంట్స్ కూడా చేస్తున్నారు.. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా మారడానికి చాలా కష్టపడ్డారు.. ఒకానొక స్టేజ్ లో ఇది కుదరదు అని చాలా మంది అన్నా కూడా తాను ట్రై చేస్తూనే వున్నాడు..తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో పుట్టిన సందీప్ రెడ్డి వంగా 8వ తరగతి వరకు వరంగల్లులోని ప్లాటినం జూబ్లీ హైస్కూల్, అఘాఖాన్ ఎడ్యుకేషనల్ సోసైటీ స్కూల్లో చదివి 10వ తరగతి నుండి 12వ తరగతి వరకు హైదరాబాదులో చదివాడు. దార్వాడలోని ఎస్.డి.ఎం. వైద్య కళాశాలలో ఫిజియోథెరఫీ పూర్తిచేసి, కొన్నాళ్లు వైజాగ్ లో ఉద్యోగం చేసాడు.సినిమారంగంపై ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ అఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ ఫై శిక్షణ తీసుకున్నాడు.


2010లో నాగార్జున నటించిన ’కేడి’ సినిమాకు సందీప్ రెడ్డి వంగా అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసాడు.. అలాగే శర్వానంద్ నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ‘ సినిమాకు కూడా అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసాడు..దర్శకుడు కావాలనే ఉద్దేశంతో ‘అర్జున్ రెడ్డి’ స్క్రిప్ట్ రాసుకొని చాలా మంది హీరోలను ప్రొడ్యూసర్ లను కలిసాడు.. అయినా లాభం లేకుండా పోయింది.. అందరూ చేద్దాం చేద్దాం అంటూ తిప్పించుకున్నారు గాని ఛాన్స్ ఇవ్వలేదు.. ఇక ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో సందీప్ తండ్రి, అన్న కలిసి భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు.విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా ఆగస్టు 26,2017 రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. ఈ సినిమాను 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తే ఏకంగా 50 కోట్ల రూపాయలు వచ్చాయి.. అయితే సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాలో బోల్డ్ సీన్స్, డ్రగ్స్ సీన్స్ పై చాలా వివాదాలే వచ్చాయి.. కానీ సందీప్ వాటిని పట్టించుకోలేదు..ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ తో రీమేక్ చేసి ఏకంగా 300 కోట్ల రూపాయలు రాబట్టాడు.. ఆ తరువాత బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ తెరకెక్కించిన ‘యానిమల్’ సినిమా  పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి ఏకంగా 900 కోట్ల వసూళ్లు సాధించింది.. యానిమల్ సినిమాతో సందీప్ రేంజ్ మరింత పెరిగింది.. ఏకంగా 100 కోట్ల పారితోషకం అందుకుంటున్నట్లు సమాచారం..త్వరలో ప్రభాస్ తో తెరకెక్కించబోయే స్పిరిట్ సినిమా కోసం ఏకంగా 120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: