* త్రివిక్రమ్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువ
* మినిమమ్ గ్యారెంటీ సినిమాలు ఎక్కువ
* రూ.30 కోట్ల రెమ్యూనరేషన్
డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తప్పే అవుతుంది. ఈయన తీసే సినిమాలలో డైలాగుల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. త్రివిక్రమ్ సినిమాల్లోని డైలాగులు సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడిని దర్శకుడిగా కంటే మాటల రచయితగా, మాటల మాంత్రికుడిగా ఎక్కువగా పిలుస్తారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాత అంతటి గొప్ప పేరు, క్రేజ్, రెమ్యునరేషన్ తీసుకునే దర్శకులలో ముందు వరుసలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉంటారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కో సినిమాకు దాదాపు 30 నుంచి 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆయన మొదట ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయాలు తెలుగులోకి వస్తున్నాయి. త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి రాకముందు ఒక లెక్చరర్ గా పని చేశాడు.
అలా లెక్చరర్ గా పనిచేస్తున్న త్రివిక్రమ్ హైదరాబాద్ వచ్చి నటుడు సునీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఆర్ పి పట్నాయక్ ముగ్గురు కలిసి ఒకే గదిలో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. అలా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో స్రవంతి రవి కిషోర్, రామోజీరావు కలిసి నిర్మించిన చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు.
అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మొదటి రెమ్యూనరేషన్ 3వేల రూపాయలతో ప్రారంభించారు. 3వేల రూపాయలతో ప్రారంభమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రస్థానం నేడు ఒక్కో సినిమా కు 30 కోట్లు తీసుకునే స్థాయికి చేరింది. అలా త్రివిక్రమ్ తన అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా కొనసాగు తున్నారు.