- జెంటిల్మెన్ సినిమాతో సినిమాల్లోకి డైరెక్టర్ గా ఎంట్రీ..
- ప్రేమికుడు,భారతీయుడు, జీన్స్ సినిమాలతో స్టార్ డైరెక్టర్ హోదా..
- సమాజంలో ఉండే సమస్యలనే సినిమాల రూపంలో తీస్తూ..


 జెంటిల్ మెన్ అనే మూవీ తో సౌత్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ ఎస్.శంకర్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ప్రభుదేవా తో చేసిన ప్రేమికుడు మూవీ సౌత్ లో పెద్ద సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన భారతీయుడు శంకర్ రేంజ్ ని ఇండియా మొత్తం తెలిసేలా చేశాయి.మరి అలాంటి శంకర్ మొదటి రెమ్యూనరేషన్ ఎంత.. ఆయన సినిమాల గురించి తెలుసుకుందాం..

 శంకర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ :

 డైరెక్టర్ ఎస్.శంకర్ అర్జున్ సార్జాతో కలిసి జెంటిల్ మెన్ అనే మూవీని తీశారు.ఈ సినిమాకి ఆయనే అసిస్టెంట్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా చేశారు.అయితే మొదటి సినిమా అయినప్పటికీ శంకర్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు.ఇక ఈ సినిమాకి నిర్మాతగా చేసిన KTకుంజుమన్ డైరెక్టర్ శంకర్ కి పారితోషికంగా 5000 ఇచ్చారు. అయితే ఐదువేల రూపాయలను మొదటి పారితోషికంగా అందుకున్న శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు కేటీ కుంజుమన్ గారు ఇచ్చిన ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ 5 లక్షలతో సమానం అంటూ చాలా సంతోషంగా చెప్పారు.అలా బ్లాక్ బస్టర్ సినిమాలు తీసే శంకర్ మొదటి రెమ్యూనరేషన్ కేవలం 5000 రూపాయలు మాత్రమే.. ఇక జెంటిల్మెన్ మూవీ తర్వాత ప్రేమికుడు,  భారతీయుడు, జీన్స్,బాయ్స్,ప్రేమిస్తే,శివాజీ, ఐ, రోబో, ఒకే ఒక్కడు,రోబో 2 వంటి ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా చేశారు.ఇక ఈయన తీసిన మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని ఒక ఊపు ఊపేసాయి.


ఇక రీసెంట్ గా భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీ అభిమానులను నిరాశపరిచింది. ఇక త్వరలోనే ఈయన డైరెక్షన్ వహించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా పైనే శంకర్ సినీ కెరియర్ ఆధారపడింది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఈయన చేసే సినిమాల్లో మ్యాజిక్ తగ్గిపోయింది అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అయితే డైరెక్టర్ శంకర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో సమాజంలో ఉండే సమకాలిన సమస్యల గురించి ఎంతోమందికి కళ్ళకు కట్టినట్లు తన సినిమాల ద్వారా చూపించారు. అంతేకాకుండా ఈయన సినిమాల్లో చూపించే విజువల్ ఎఫెక్ట్స్ ఎంతో మందిని ఆకర్షించాయి. అలా తన సినీ కెరియర్లో ఇప్పటివరకు నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్, ఒక జాతీయ చలనచిత్ర అవార్డు, అలాగే ఆరు జాతీయ చలనచిత్ర బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ అవార్డ్స్,ఆరు తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డ్స్ అందుకున్నారు. అలా శంకర్ తన అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: