తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అపజయం ఎరగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. రచయితగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి.. 2015లో పటాస్ మూవీ తో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే తన సత్తా ఏంటో చూపించిన అనిల్.‌‌. ఆ తర్వాత సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2, భగవంత్‌ కేసరి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందాడు.స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో అనిల్ రావిపూడి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తుండ‌గా.. ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపుదిద్దుకుంటున్న వెంకీ-అనిల్ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.

అయితే ఈ చిత్రానికి అనిల్ రావిపూడి అందుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వరుస విజయాలు నేపథ్యంలో అనిల్ రావిపూడి చిత్రాల‌కు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అనిల్ రావిపూడి సినిమా అంటే ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్స్ కు ప‌రుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెమ్యునరేషన్ విషయంలో హీరోలను సైతం అనిల్ రావిపూడి డామినేట్ చేస్తున్నాడని ఇన్సైడ్ బ‌లంగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ తో చేస్తున్న సినిమా కోసం అనిల్‌ రావిపూడి ఏకంగా రూ. 25 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నాడట.అనిల్ సినిమాలు మంచి బిజినెస్ చేస్తుండటం.. లాభాలు కూడా వస్తుండటంతో..నిర్మాతలు కూడా అనిల్ రావిపూడికి అడిగినంతా కట్టబెడుతున్నారట.ఇక అతని రెమ్యూనరేషన్ విషయానికొస్తే మొదట్లోఅనిల్ రావిపూడి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన గోపీచంద్ సౌర్యం మూవీ కి వేలల్లో వున్నా రెమ్యూనరేషన్, ఆతరువాత లక్షల్లోచేరింది.ఇదిలావుండగా గతంలో అనగా పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2సినిమాలకు రెండు మూడు కోట్ల తీసుకున్న ఈ యువ డైరెక్టర్ మహేష్ బాబు సినిమాతో ఒక్క సారిగా 15కోట్లకు ఎగబాకాడు అనిల్. మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఆయన 15 కోట్లు తీసుకున్నాడని టాక్. ఇక ఆతరువాత కూడా వరుసగా హిట్లు పడుతుండటంతో.. ఆయన రేటు 25 కోట్లకు చేరినట్టు సమాచారం.ప్రస్తుతం ఈ విషయం నెట్టింటా వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: