టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. విభిన్నమైన సినిమాలను తెరకెక్కించడం ద్వారా విజయాలను సొంతం చేసుకున్న బోయపాటి శ్రీను భద్ర సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ సమయంలో ఈ సినిమా ఒక్కడు సినిమాను పోలి ఉందని కామెంట్లు వినిపించినా మెజారిటీ ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చింది.
 
మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో బోయపాటి శ్రీను కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే సంగతి తెలిసిందే. భద్ర సినిమాకు బోయపాటి శ్రీను పారితోషికం 5 లక్షల రూపాయలు కాగా ఇందులో 3.5 లక్షల మొత్తం కారు రూపంలో బోయపాటికి దక్కింది. మిగిలిన 1.5 లక్షల రూపాయలు క్యాష్ రూపంలో అందుకున్నారు. ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ఈ విషయాలను చెప్పుకొచ్చారు.
 
అయితె సాధారణంగా బ్లాక్ బస్టర్ సినిమా రీమేక్ రైట్స్ ను ఇతర భాషల్లో విక్రయించిన సమయంలో దర్శకుడికి కూడా 50 శాతం వాటా లభిస్తుంది. అయితే బోయపాటి శ్రీనుకు భద్ర తొలి సినిమా కావడంతో ఆ వాటా కూడా ఆయనకు దక్కలేదని తెలుస్తోంది. భద్ర సినిమా తర్వాత బోయపాటి శ్రీను దిల్ రాజు కాంబినేషన్ లో మరో సినిమా అయితే రాలేదనే సంగతి తెలిసిందే.
 
తులసి, సింహా విజయాలు బోయపాటి శ్రీను కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యాయి. లెజెండ్, అఖండ సినిమాలు బోయపాటి శ్రీను రేంజ్ ను పెంచాయి. సరైనోడు, జయ జానకి నాయక సినిమాలు సైతం బోయపాటి శ్రీను కెరీర్ కు ఎంతో ప్లస్ అయ్యాయి. దమ్ము, వినయ విధేయ రామ, స్కంద సినిమాలు మాత్రమే బోయపాటి శ్రీను కెరీర్ లో నిరాశకు గురి చేసిన సినిమాలు అని చెప్పవచ్చు. బోయపాటి శ్రీను ప్రస్తుతం అఖండ2 ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: