త్రివిక్రమ్‌ది కూడా అంతే. కాకపోతే ఆయన కలం.. కాస్త చిలిపిదనం, కాస్త వెటకారం వస్తుంది. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. అందుకే ఆయనను అందరూ మాటల మాంత్రికుడు అంటారు. త్రివిక్రమ్ ఐకానిక్ డైలాగులు కొన్ని చూద్దాం.
1) కారణం లేని కోపం, ఇష్టం లేని గౌరవం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం - తీన్మార్.
2) తెగిపోయేటప్పుడు దారం బలం తెలుస్తుంది.. వెళ్లిపోయేటప్పుడు బంధం విలువ తెలుస్తుంది - అత్తారింటికి దారేది.
3) పనిచేస్తే జీతం అడగొచ్చు.. అప్పు ఇచ్చి వడ్డీ అడగొచ్చు.. హెల్ప్ చేసి మాత్రం థాంక్స్ అడగకూడదు - మల్లేశ్వరి.
4) అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు - ఖలేజా. 5) ఎప్పుడు జరిగే దాన్ని అనుభవం అంటారు.. ఎప్పుడో జరిగేదాన్ని అద్భుతం అంటారు - అజ్ఞాతవాసి. 6) మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి.. కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు - సన్నాఫ్ సత్యమూర్తి.
6) నిజం చెప్పేటప్పుడు భయం వేస్తుంది.. చెప్పకపోతే ఎప్పుడూ భయం వేస్తుంది.. - అలవైకుంఠపురంలో.
7) నిజం చెప్పకపోవడం అబద్ధం.. అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.. - అతడు.
8) సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టి అర్హత లేదు - నువ్వే నువ్వే.
9) మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు.. ఓడినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేకపోతే ఎంత సంపాదించి.. ఎంత పోగొట్టుకున్న తేడా ఉండదు - నువ్వు నాకు నచ్చావ్.