ఈ పాన్ ఇండియా హీరో సినిమాలో అవకాశం వస్తే ఎవరూ అసలు వదులుకో కూడదని కూడా అనుకుంటారు. అలాంటి పాన్ ఇండియా హీరోకు ఓ హీరోయిన్ నటన అంటే ఎంతో ఇష్టమట. ఆమె తో ఓ సినిమా చేయాలని కూడా ఉందని తన మనసులో మాటను కూడా బయట పెట్టాడు.. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్..ఆ ఇంటర్వ్యూలో వచ్చిన ఓ ప్రశ్నకు ఏ హీరోయిన్ తో మీరు పని చేయాలని అనుకుంటున్నారని అడగగా .. ఇక ప్రభాస్ తన మనసులో మాటను ఇట్టే చెప్పేసాడు.. తనకు ఇష్టమైన హీరోయిన్స్‌లో మహానటి సావిత్రి, సౌందర్య ఇష్టమని చెప్పాడు. తను సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సౌందర్య గారితో సినిమా చేయాలని అనుకున్న అని కూడా అన్నారు.
ఆమె నటన అంటే నాకు ఎంతో ఇష్టమని.. కానీ ఆమెతో సినిమా అంటే తన నటన తేలిపోతుందేమో అన్న భయం కలిగిందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అలాగే ఆమెతో సినిమా చేయాలని కోరిక అలాగే నెరవేరకుండా ఉండిపోయిందని.. ప్రభాస్ చెప్పకు వచ్చాడు. అలాగే ఇప్పుడున్న హీరోయిన్స్ లో తనకు సాయి పల్లవి, నిత్య మినన్ అంటే ఇష్టమని ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ చెప్పాడు . ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.