దర్శకేంద్రుడి కే . రాఘవేంద్రరావు తన కొడుకు కోవలమూడి ప్రకాష్ ని హీరోగా పరిచయం చేస్తూ 'నీతో' అనే సినిమాను తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాకు జాన్ మహేంద్రన్ దర్శకత్వం వహించాడు . అలాగే ఈ సినిమాల్లో ప్రకాష్ కి జంటగా మహెక్ చాహాల్ హీరోయిన్ గా నటించింది . అయితే ఈ సినిమా అప్పుట్లో ఆశించిన స్థాయిలో గొప్ప విజయం అందుకో లేక పోయింది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది . ఇంకా ఈ సినిమా తర్వాత ప్రకాష్ ఇండస్ట్రీ నుంచి పక్కకి వెళ్లిపోయాడు.
అయితే తర్వాత ఇదే సినిమాని దళపతి విజయ్ కోలీవుడ్లో 'సచిన్' పేరుతో రీమిక్స్ చేశాడు . అక్కడ కూడా జాన్ మహేంద్రన్నే దర్శకత్వం వహించాడు . ఇక ఇందులో విజయ్ కి జంటగా జెనిలీయా, బిపాసా బసు హీరోయిన్లు గా నటించారు . తెలుగులో నెగటివ్ టాక్ రావడంతో చిన్న చిన్న మార్పులు చేసి తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తమిళ్లో ఈ సినిమా మంచి టాక్ వచ్చింది . ఏకంగా 200 రోజులకు పైగా ఆడడం విశేషం. 2005లో వచ్చిన ఈ సినిమా రూ. 25 కోట్లు కు పైగా అక్కడ కలేక్షన్లు రాబట్టింది . ఇలా తెలుగులో ఫ్లాఫ్ అయిన ఈ సినిమా తమిళ్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది .