రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా ట్రెండ్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాలో ఈ అమ్మడు ఐటెం సాంగ్ లో నటించబోతుంది అని ..బన్నీతో చిందులు వేయబోతుంది అంటూ బాగా ప్రచారం జరిగింది. దీనిపై అఫీషియల్ ప్రకటన రానప్పటికీ ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సాంగ్ లో అమ్మడు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్లు తెలుస్తుంది . అయితే సుకుమార్ కి అమ్మడు చాలా చాలా క్రేజీ కండిషన్ పెట్టిందట .
ఈ సినిమా కోసం పాట చేస్తాను కానీ నిమిషానికి కోటి అంటూ డిమాండ్ చేసిందట . మూడున్నర నిమిషాల పాటు కోసం ఆమె 3 కోట్ల 50 లక్షలు డిమాండ్ చేసిందట. అయితే శ్రీలీల కు ఉన్న క్రేజ్ కారణంగా సుకుమార్ మూడున్నర కోట్లు కూడా ఇచ్చెందుకు ఒప్పుకున్నట్లు ఓ న్యూస్ బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో సర్కులేట్ అవుతుంది. ఒక సినిమా చేస్తే రెండు కోట్లు తీసుకునే శ్రీలీల . కేవలం ఒక సినిమాలో ఐటెంపాటట చేసేందుకు మూడున్నర కోట్లు తీసుకుందా..? అయితే సుకుమార్ బాగానే ఈ సినిమాలో శ్రీలీల అందాలు చూపించుంటారు అంటూ నాటి నాటిగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు . మొత్తానికి శ్రీలీల కూడా ఇండస్ట్రీ సాంప్రదాయాన్ని బాగా ఫాలో అయిపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి ..అందం ఫిజిక్ ఉండగానే డబ్బులు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయాలి ..ఇది ఒక్కటి తెలిస్తే చాలు లైఫ్ లో సెటిలైపోయిన్నట్లే అంటూ జనాలు కూడా ఆమె తెలివితేటలను మెచ్చుకుంటున్నారు..!