ఎన్నో రూమర్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాకే నిజమయ్యాయి. దానికి దీ బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత - నాగచైతన్య విడాకులు . వీళ్ళు విడాకులు అనౌన్స్ చేసే ఆరు నెలల ముందు నుంచి సోషల్ మీడియాలో సమంత - నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ మీడియా కోడై కూసింది. అనుకున్నట్టే జరిగింది . కాగా బన్నీ కెరియర్ లోనే ఒక పరమ చెత్త రూమర్ విని స్నేహ రెడ్డి వెక్కి వెక్కి ఏడ్చిందట . అది కూడా కెరియర్ స్టార్టింగ్ లో .. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే స్నేహ రెడ్డి - బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .
స్నేహ రెడ్డి బన్నిని లవ్ చేస్తున్న మూమెంట్లోనే సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది. బన్ని ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాదు అని ..అల్లు అరవింద్ కూడా వాళ్ళ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని ..అతి త్వరలోనే వాళ్ళ పెళ్లి జరగబోతుంది అంటూ బాగా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంటే తెలియని స్నేహారెడ్డి అది బాగా నమ్మేసింది. కలిసిన నటిస్తేనే ప్రేమ పెళ్లి ఇంకేవో ఊహించుకునేసే రోజులు అవి ..అలాంటిది చాలా సైలెంట్ గా ఉండే స్నేహ రెడ్డి అలాంటి వార్తలు విని చాలా బాధపడింది. అయితే బన్ని తర్వాత నెమ్మదిగా సర్ధి చెప్పారట . సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ . నువ్వు పట్టించుకోకూడదు . నువ్వు నా భార్యవి ..నువ్వే నా భార్యవి అంటూ చాలా ప్రేమగా ఓదారుస్తూ ఆమెకు సినీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో పరిస్థితులు అర్థమయ్యేలా చెప్పుకొచ్చారట. ఆ తర్వాత అలాంటి రూమర్స్ ని పెద్దగా పట్టించుకోకుండా తన పని తను చూసుకోపోతుంది స్నేహ రెడ్డి..!