విశ్వ నాయకుడు కమల్‌ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నాలుగు దశాబ్దాలుగా దక్షిణ భారతదేశంలో సూపర్ స్టార్ హీరోగా వెలుగొందుతూ ఇప్పటికీ తన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అద్భుతమైన యాక్టింగ్, మరిచిపోని సినిమాలు, సన్నివేశాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. కమల్ హాసన్ ఎన్నో సినిమాలు చేసినప్పటికీ పెద్దగా విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కమల్ హాసన్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.


ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టించింది. అయితే ఈ సినిమా కన్నా చాలా సినిమాలు చేసి కమల్ హాసన్ భారీగా నష్టపోయారు. విశ్వరూపం సినిమాతో అప్పుల ఊబిలో కూరుకు పోయాడు కమల్ హాసన్. అయితే 2002లో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన విక్రమ్ సినిమా కమల్ హసన్ తో పాటు ఆయన నిర్మాణ సంస్థకు కూడా ప్రాణం పోసింది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన హోం బ్యానర్ లోనే నిర్మించాడు. దర్శకుడు, స్టోరీ, మంచి క్యారెక్టర్ పడితే బాక్సాఫీస్ స్టామినా ఎలా ఉంటుందనేది చూపించారు.


300 కోట్లు కలెక్షన్లను రాబడతామని ముందుగానే చెప్పి మరి హిట్ కొట్టాడు. ఈ సినిమాతో వచ్చిన డబ్బులతో తన అప్పులన్నీ తీర్చేస్తానని, స్నేహితులకు సహాయం చేస్తానని  స్వయంగా వెల్లడించారు విశ్వ నాయకుడు కమల్‌ హాసన్. విక్రమ్ తర్వాత 'కల్కి 2898 ఏడి' సినిమాలో కమల్ హాసన్ నటించాడు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టాడువిశ్వ నాయకుడు కమల్‌ హాసన్.


ఇందులో ఆయన పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ సినిమాలో ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. అందుకే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇలా ఉండగా... విశ్వ నాయకుడు కమలహాసన్ చేసిన విక్రమ్‌ సినిమాకు పార్ట్‌ 2 కూడా రాబోతుందట. త్వరలోనే దీనిపై అప్డేట్‌ రానుందని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: