వైరల్ అయిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మోహన్ లాల్ తెలిపారు. వైరల్ అయిన వార్తలు కేవలం వదంతులేనని మోహన్ లాల్ పేర్కొన్నారు. అమ్మ అసోసియేషన్ కు సంబంధించి ఆఫీస్ బాయ్ గా పని చేయడం కూడా నాకు ఇష్టం లేదని మోహన్ లాల్ పేర్కొన్నారు. హేమ కమిటీ రిపోర్ట్ వివరాలు తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్ లాల్ వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
మేము మూకుమ్మడిగా అసోసియేషన్ కు సంబంధించిన పదవులకు రాజీనామా చేయడానికి గల కారణాన్ని చెప్పాలని అందరూ అడుగుతున్నారని మోహన్ లాల్ పేర్కొన్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీదే అని ఆయన తెలిపారు. ఆ రిపోర్ట్ ఎన్నో సమస్యలను బయటపెట్టిందని మోహన్ లల్ వెల్లడించడం గమనార్హం. మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించింది.
మలయాళ ఇండస్ట్రీకి చెందిన మహిళలు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని హేమ కమిటీ రిపోర్ట్ వెల్లడించింది. 2018 సంవత్సరం నుంచి మోహన్ లాల్ ఈ అసోసియేషన్ కు అధ్యక్షునిగా వ్యవహరించడం గమనార్హం. మోహన్ లాల్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మోహన్ లాల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది.