దర్శక ధీరుడు రాజమౌళి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే .. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాలో కూడా ఆయన అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలాగే తాను తెరకెక్కించిన సినిమాల్లో క్లైమాక్స్ లో కనిపించడం ఆయనకు అలవాటే .. గతంలో అమృతం సీరియల్ లోను ఆయన ఓ చిన్న పాత్రలో నటించాడు. అయితే రాజమౌళి వేరే ఓ సినిమాలో కొంచెం లాంగ్ లెన్త్ ఉన్న పాత్ర చేసిన విషయం చాలా మందికి అంతగా తెలియదు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు నాని హీరోగా వచ్చినా మజ్ను .. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమా స్టార్టింగ్ లో , క్లైమాక్స్లో రాజమౌళి పాత్ర కనిపిస్తుంది. అయితే ఈ సినిమా చేసే సమయానికి రాజమౌళి బాహుబలి సినిమాల షూటింగ్లో బిజీగా  ఉన్నాడు.


అయితే ఈ సినిమాలో కూడా రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించే దర్శకుడుగానే కనిపించడం విశేషం. అలాగే హీరో నాని ఈ సినిమాలో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కనిపిస్తాడు.  అయితే ఈ సినిమాలో రాజమౌళితో చిన్న క్యామియో రోల్ చేయించాలన్న ఆలోచన దర్శకుడుది కాదట.. హీరో నానిదట.. ముందు నాని పాత్రను ఒక సినిమా రైటర్ గా అనుకున్నామని.. కానీ నానినే అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని చెప్పాడట. అంతేకాక రాజమౌళి దగ్గర ఆ పాత్ర అసిస్టెంట్ డైరెక్టర్ అయితే బాగుంటుందని కూడా ఆయన సూచించాడని వర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.


ఆ తర్వాత కూడా నానినే రాజమౌళి తో మాట్లాడి క్యామియో పాత్ర కూడా చేయించడానికి ఒప్పించినట్లు కూడా చెప్పాడు. ఆ సమయంలో రామోజీ ఫిలిం సిటీ లో బాహుబలి షూట్ జరుగుతుంది. అక్కకే తాము వెళ్లి కొన్ని సన్నివేశాలు చిత్రీకరించామని అయితే సినిమాలో వాడిన రథాన్ని తమ కోసం ఇవ్వలేని పరిస్థితుల్లో తామే వేరుగా ఓ రథం చేయించి దాంతో ఆ సన్నివేశం చిత్రీకరించామని విరించి వెల్లడించాడు. ఆ సీన్ షూట్ చేస్తున్నపుడు టేక్ ఓకేనా అని రాజమౌళి మళ్లీ మళ్లీ అడిగేవాడని.. కానీ అంత గొప్ప దర్శకుడికి తాను చెప్పడం ఏంటి అని ఆయన చేసింది ఓకే చేసేవాడినని వివరించి తెలిపాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: