ఏదైనా ఒక వస్తువు లారీ లేదా రైలు  కింద పడితే ఏం జరుగుతుందో ఇప్పుడు అచ్చం అలాంటి పరిస్థితి దేవర - బాహుబలి సినిమాల కారణంగా పుష్ప 2 కి వచ్చింది.. ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ తక్కువేమీ లేదు .. అలాగే తన మార్కెట్ కి వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు.. అయినా కూడా బాహుబలి 2, దేవర1 మధ్యలో పుష్ప2 నలిగిపోయే పరిస్థితి వచ్చింది. బాహుబలి మొదటి భాగం తర్వాత వచ్చిన బాహుబలి 2లా పుష్ప 2 ని పోల్చే పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. అలాగే దేవరల  పుష్పసిక్వెల్ ది ఒకే ఎటాక్ ఏం కాదు. ఈ అరుదైన సమస్య బన్నీకి ఎదురవుతుంది . దేవర కారణంగా పుష్ప 2 కి ఎక్కడలేని తలనొప్పి వస్తుంది. ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా అలా ఎలా అల్లు అర్జున్ ను ఇబ్బంది పెడుతుంది.


పుష్ప2కి బాహుబలి 2కి ఎక్కడ ఎలాంటి సంబంధం లేదు. అలాగే దేవరతో కూడా ఎలాంటి పోలిక లేదు. కానీ ఈ రెండు విజయాలు పుష్ప రాజ్‌ని తగ్గేలా చేస్తున్నాయి. అసలు ఎక్కడా అస్సలు తగ్గేదేలేదన్న పుష్ప గాడు ఈ రెండు సినిమాల మధ్య నలిగిపోయే పరిస్థితి వచ్చింది. కామన్ గా ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే పోటీకి భారీ మూవీలో వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ బాహుబలి 2 ఎప్పుడో వచ్చి సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసింది. దేవ‌ర‌ కూడా సెప్టెంబర్ లో వచ్చి అదే సెన్సేషన్ రికార్డును అందుకుంది.. కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా ఎలానో పుష్ప2కి పోటీ కానే కాదు అలాంటప్పుడు ఈ రెండు సినిమాల కింద పుష్ప2 నలిగిపోవటం ఏంటి అనేది అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది.


నిజానికి పుష్ప2 ఎప్పుడో ఏడాది క్రితం ప్రేక్షకులు ముందుకు రావాల్సిన సినిమా.. ఎన్టీఆర్ దేవర కంటే ముందే రిలీజ్ అయి పక్కకు వెళ్లి పోవాల్సిన‌ సినిమా. అలాంటి మూవీ ఇప్పుడు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత రాబోతుంది. ఇప్పుడు ఇదే అసలు సమస్యగా మారింది. బాహుబలి 2 కూడా రెండు సంవత్సరాల అనుకుంటే మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని వచ్చారు.. అలా వచ్చి కూడా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపింది. ఇప్పుడు అలా చూస్తే పుష్ప వచ్చిన మూడు ఏళ్లకు పుష్ప2 వస్తుంది. పుష్ప హిట్ అయిందని పుష్ప2 కూడా బాహుబలి 2 రేంజ్ లో దుమ్ము దులిపే సీన్ కనిపించడం లేదని.. అలా అని ఆ సినిమాని తక్కువ చేసి చూడలేము కానీ బాహుబలి 2 రేంజ్ లో ఆ క్యూరియాసిటీ పుష్ప2 మూవీ ప్రేక్షకుల్లో క్రియేట్ చేయలేకపోయింది. మరి ఎక్కువ సేనబడితే కత్తి ముక్కు విరిగినట్టు సుకుమార్ అతి చెక్కుడు ఎంతో విలువైన కాలాన్ని కరిగిస్తుందని కామెంట్లు కూడా పెరిగాయి.


అంతే కాదు దేవర కూడా ఓరకంగా పుష్ప2 కి భారంగా మారింది. వెట్టయాన్ నుంచి స్ట్రీ వరకు పోటీకి ఎన్నిమూవీలు వచ్చినా  దేవర పక్కకు నెట్టుకుంటూ పోయాడు. థౌైజెండ్ వాలాగా దూసుకుపోయ‌డు. కాని పుష్ప2 కి డిసెంబర్ 5న ఆస‌లు పోటీనే లేదు. బాలీవుడ్ మార్కెట్ లో పోటీ ఇస్తుందనకున్న చావా మూవీ కూడా వాయిదా పడింది.. 11500 థియేటర్స్ ఈ సినిమా రీలీజ్ అవుతుంది కాబట్టి, అంతగా కాలం కలిసొచ్చినా 1000 కోట్ల వసూళ్లు రాకున్నా, లేటుగా వచ్చినా పుష్ప 2 ని సెన్సేషన్ గా కన్సిడర్ చేయరు .. అందుకే బాహుబలి 2 తో పోలికలు పుష్ప2 మీద అదనపు భారంగా మారటం, అంత‌ హైప్ ఈ సీక్వెల్ కి లేకపోవటం, దేవర లా చాలా సినిమాలతో పోటీ పడి గెలవాల్సిన పరిస్థితులు లేకపోవటంతో, ఏం మాత్రం తగ్గినా పుష్ప నెగటం కష్టమని అనుమానాలు మూవీ టీం ను కంగారుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: