ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “... క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు..గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది..పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయం సాధించింది.. అల్లు అర్జున్ కెరీర్ లో  భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా పుష్ప సినిమా నిలిచింది.. అంతేకాదు ఈ సినిమాలో తన అద్భుతమైన నటనకు గాను నేషనల్ అవార్డ్ లభించింది.. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ముఖ్యంగా సమంత చేసిన ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది.. ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించినందుకు గాను దేవిశ్రీకి సైతం బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ వచ్చింది.. 

ఇదిలా ఉంటే పుష్ప కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు కూడా దేవిశ్రీ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి.. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ డేట్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచనున్నారు.. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విన్న బన్నీకి అంతగా నచ్చకపోవడంతో బిజీఎం కోసం దేవికి బదులు తమన్ కు మేకర్స్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.. అలాగే మరో ఇద్దరూ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇందులో యాడ్ కానున్నట్లు సమాచారం.. నేషనల్ అవార్డు అందుకున్న దేవిశ్రీని కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్స్ తీసుకోవడంతో సినిమాపై ప్రేక్షకులలో నెగటివ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.. దేవిశ్రీ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉండగా మరో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ ఆలస్యం కావడం ఇంకా సాంగ్ బ్యాలన్స్ ఉండటం.. రిలీజ్ దగ్గరపడటంతో దేవిశ్రీ సమస్య సినిమా రిలీజ్ పై ప్రభావం చూపిస్తుందేమో అని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.. అయితే మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సింది..

మరింత సమాచారం తెలుసుకోండి: