చెన్నైలో పుట్టి పెరిగిన ఈ సీనియర్ నటి .. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో ఎంట్రి ఇచ్చింది . తన కెరియర్ మొదటిలో గోకులంలో సీత , శుభాకాంక్షలు సినిమాల తో మంచి పేరు తెచ్చుకుంది రాశి ... తర్వాత ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మారింది . ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియల్స్ లో కూడా చేస్తూ బుల్లి తెర పై కూడా రాణిస్తున్నారు . అలాంటి రాశి గతం లో టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరి తో నటించింది.
అయితే ఈమె సినిమాల్లో నటిస్తున్న సమయంలో.. మరో హీరో వేణు తొట్టెంపూడి తో ప్రేమలో పడిందని టాక్ కూడా వచ్చింది . వీరిద్దరూ కలిసి మనసు పడ్డారు అనే సినిమాలో కలిసి నటించారు . ఆ సినిమా సమయంలోనే వీరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడిందని ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో పలు వార్తలు కూడా బయటకు వచ్చాయి . ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడం తో వీరు రిలేషన్ లో ఉన్నట్టు రూమర్స్ వచ్చాయి . ఈ విషయం పై వారు క్లారిటీ ఇచ్చారు . మా ఇద్దరి మధ్య ఎటు వంటి రిలేషన్ లేద ని తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చింది . ఇక దాంతో ఆ వార్తలు అక్కడితో అగిపోయయి.