అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయాడు. రణ్‌బిర్ కపూర్ తో య‌నిమల్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను ప్రకటించాడు సందీప్ రెడ్డి వంగ. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ను మొదటిసారిగా పోలీస్ యూనిఫాంలో  చూపించబోతున్నానంటూ సినిమా కు సంబంధించి ఫస్ట్ అప్డేట్ తోనే మూవీపై అంచనాలు పెంచేశాడు. అలాగే రెబల్ స్టార్ ఇందులో రూత్‌లెస్ వైల్డ్ పోలీస్ గా చూపించబోతున్నాయని కూడా సందీప్ అన్నాడు.


ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాల్లో ప్రభాస్‌కు జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించి బోతుందట. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమాలో నయనతార హీరోయిన్గా నటించింది. మళ్లీ  ఈ కాంబో రిపీట్ అవ్వలేదు. ఇన్నేళ్లకు మళ్ళీ ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న టాక్‌ కూడా వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాలో ఒ  కీలకమైన గెస్ట్ రోల్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని టాలీవుడ్ సర్కిల్స్లో ఒక కేజీ వార్త వైరల్ గా మారింది. గతంలో కూడా ఒకటి రెండు సినిమాల్లో చిరంజీవి గెస్ట్ రూల్స్ లో  నటించిన అవి తన కుటుంబ సభ్యుల కోసమే చేశాడు.


ప్రభాస్ సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్‌ విషయం పై ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే డిస్కషన్లు జరుగుతున్నాయట. గతంలో ఎన్నో సందర్భాల్లో తాను చిరంజీవి అభిమాని అని చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మెగాస్టార్ కోసం ఎలాంటి గెస్ట్ రోల్ డిజైన్ చేశారు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. స్పిరిట్‌ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్‌ ప్లాన్ ఎవ‌కు ఉహించ‌ని విధంగా ఉంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. చిరుతో పాటు మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ఈ అప్‌డేట్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: