బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు పొందిన అర్జున్ కపూర్ ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లు పూర్తి అవుతున్నది. అయినప్పటికీ కూడా స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోతున్నారు హీరో అర్జున్ కపూర్.. ప్రతిసారి కూడా తను నటన పైన విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈమధ్య  అర్జున్ కపూర్ సినిమాలలో కంటే వ్యక్తిగత విషయాలు గురించి తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకంటే చాలా పెద్దదైన మలైకా ఆరోరాలతో ఎనిమిదేళ్లుగా రిలేషన్ పెట్టుకొని ఇప్పుడు మళ్లీ సింగల్ గా మారిపోయాను అంటూ తెలిపారు.


అలాగే హీరోగా అవకాశాలు లేక సతమతమవుతున్న సమయంలో విలన్ పాత్రలో కనిపించారు. అజయ్ దేవగన్ నటించిన సింగం ఎగైన్ చిత్రంలో ప్రతి నాయకుడుగా నటించారు. ఈ సినిమా ఇంటర్వ్యూలో భాగంగా తనకున్న సమస్యల గురించి అర్జున్ కపూర్ తెలియజేశారట. తాను ఒక అరుదైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నానంటూ తెలియజేశారు. దానివల్లే తాను చాలా డిప్రెషన్ కి గురవుతూ ఉన్నానని వెల్లడించారు. హషిమోటోస్ థైరాయిడిటిస్ అని ఆటో యూనియన్ డిజాస్టర్ తో ఇబ్బంది పడుతున్నట్లుగా అర్జున్ కపూర్ తెలియజేశారు.


అయితే ఈ సమస్యతో ఉన్నవారు శరీరంలోని రోగ నిరోధక కణాలు సైతం శరీరంలోని చాలా భాగాలను దెబ్బతీస్తాయట. ఇది బరువు పెరగడానికి కూడా ముఖ్య కారణం అవుతున్నది అంటూ తెలిపారు. మానసిక ఒత్తిడి వల్ల కూడా పెరిగే అవకాశం ఉందని అందుకే అందరికీ కాస్త దూరంగా ఉంటున్నానంటే తెలియజేశారు అర్జున్ కపూర్. ఎక్కువగా తాను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతానని ఇది మాత్రమే కాదు.. గత ఏడాది చాలా డిప్రెషన్ కి గురయ్యి తన సినిమాలు ఫ్లాపులు కావడంతో ఇతర సినిమాలు చూశాక ఇలా చేయలేనని ఫీలింగ్ కూడా మొదలయ్యిందని.. సినిమాలు అంటే తనకు చాలా ఇష్టమని కానీ సినిమాలు చూడడం మానేశాను.. ఎంతోమంది థెరపిస్టులను కూడా కలుస్తూ ఉన్నానని తన డిప్రెషన్ ని నయంచేసే వైద్యుడుని చివరికి తెలుసుకున్నానని తెలిపాడు అర్జున్ కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: