అక్కడి నుంచి వారిద్దరూ తిరిగి కలిసిన నటించలేదు ఆ సినిమా ఏదో కాదు నిప్పురవ్వ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య - విజయశాంతి జంటగా నిప్పురవ్వ లాంటి భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు విజయశాంతి నిర్మాత.. పైకి బాలయ్య పేరు వేసుకున్నా తెర వెనక సినిమా ఖర్చు మొత్తం విజయశాంతి భరించారు. సినిమా షూటింగ్ టైంలో బొగ్గు గనుల నేపథ్యంలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరిద్దరూ మృతి చెందారన్న వార్తలు బయటికి వచ్చాయి. సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనికి తోడు భారీ బడ్జెట్ కావడంతో అనుకున్న దాని కంటే చాలా ఎక్కువగా ఖర్చయింది. రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అదే రోజు బాలయ్య నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు కూడా రిలీజ్ అయింది.
అలా బాలకృష్ణ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. బంగారు బుల్లోడు సూపర్ డూపర్ హిట్ అయితే ... నిప్పురవ్వ భారీ బడ్జెట్ కారణంగా దీనికి తోడు కథ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేక ప్లాప్ సినిమాగా నిలిచింది. దీనికి తోడు విజయశాంతికి నష్టాలు తప్పలేదు. ఈ క్రమంలోని విజయశాంతి బంగారు బుల్లోడు సినిమాను బాలయ్య వాయిదా వేయిస్తే నిప్పురవ్వ సినిమాకు మరిన్ని ఎక్కువ వసూళ్లు వచ్చేవని బాలయ్య నిప్పరవ్వ సినిమాపై సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేదన్న భావనకు విజయశాంతి వచ్చేసారు. అలా ఆ సినిమా బాలయ్య విజయశాంతి స్నేహ బంధానికి బేటలు వచ్చేలా చేసింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు.