సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరోకి కూడా ఒక ట్యాగ్ ఉంటుంది . కొన్నిసార్లు ఆ ట్యాగ్ ని వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు . మరి కొన్నిసార్లు మాత్రం ఆ ట్యాగ్ ని వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు . కొన్నిసార్లు ఫ్యాన్స్ ఇస్తూ ఉంటారు . ట్యాగ్ ఎవరు ఇచ్చినా.. ఎలా ఇచ్చిన.. ఎప్పుడు ఇచ్చిన.. దాన్ని మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్టార్ హీరోస్ . మరి ముఖ్యంగా చిరంజీవికి మెగాస్టార్ అని బాలయ్యకు నట సిమ్హం అని.. తారక్ కి యంగ్ టైగర్ అని ..రాంచరణ్ కు మెగా పవర్ స్టార్ ని ట్యాగ్స్ ఇచ్చింది జనాలు .


అలాంటి జనాలు నాగార్జునకు కింగ్ , నవమన్మధుడు , యువ సామ్రాట్ అంటూ ఎన్నో ట్యాగ్స్ ఇచ్చారు . అయితే రీసెంట్ గా ఆ ట్యాగ్ ను మార్చేస్తూ సోషల్ మీడియాలో జనాలు సరికొత్త ట్యాగ్ ని నాగార్జున కి ఇచ్చేశారు . రీసెంట్గా నాగార్జున - చిరంజీవి - మహేష్ బాబు - రామ్ చరణ్ - అఖిల్ మాల్దీవ్స్ లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. ఓ బడా వ్యాపారవేత్త బర్త డే పార్టీకి హాజరైన విషయం అందరికీ తెలుసు.



దానికి సంబంధించిన ఒక ఫోటో బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ ఫోటోలో అందరూ చాలా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో కనిపించారు . మరీ ముఖ్యంగా నాగార్జున ఎప్పుడు కనిపించే లుక్స్ కి విభిన్నంగా కనిపించాడు . పూల పూల చొక్క.. వేసుకొని ట్రెండి హెయిర్ స్టైల్ తో చాలా ఆకట్టుకునే లుక్స్ లో దర్శనమిచ్చాడు.  ఈ లుక్స్ చూస్తున్నా అందరూ "నాటి" నాగార్జున అంటూ ట్యాగ్స్  ఇచేస్తున్నారు . అంతకుముందు వరకు నవ మన్మధుడు అని చెప్పుకొచ్చే జనాలు . ఇప్పుడు మా నాటీ నాగర్జున అంటూ మాట్లాడుతున్నారు . దీంతో నాగార్జునకు కొత్త ట్యాగ్ ఇచ్చినట్లయ్యింది.  సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈయన ల్లుక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: