జూనియర్ ఎన్టీఆర్ ది ఎంత మంచి మనసో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మనసున్న మహారాజు . ఎంతమంది ఆయనను ట్రోల్ చేస్తున్న సరే వాళ్ళని ఏం మాత్రం సీరియస్ గా కోప్పడరు . వాళ్ళపై ఎటువంటి లీగల్ యాక్షన్స్ కూడా తీసుకోరు . ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్ ని ఎలా దారుణంగా ట్రోల్ చేసారో కూడా చూశాం. కానీ తారక్ ఏ మాత్రం పట్టించుకోలేదు . తన పని తాను చేసుకుపోతూ వచ్చాడు . మరి ముఖ్యంగా దేవర సినిమా విషయంలోనూ కొంతమంది పెద్ద వ్యక్తులు సినీ ప్రముఖులు ఆయనను ఇబ్బందికర మాటలతో బాగా బాధపెట్టారు .


అయినా కూడా తారక్ ఏమీ అనలేదు . కాగా తారక్ ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇస్తాడో మనందరికీ బాగా తెలుసు.  మరీ ముఖ్యంగా తారక్ కి ఇండస్ట్రీలో లేడీ ఫ్రెండ్స్ చాలా తక్కువ . వాళ్ళల్లో ఒకరే ఆలియా భట్ . బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ అలియాభట్ అంటే తారక్ కి చాలా చాలా ఇష్టం . ఎంతలా అంటే దేవర సినిమాలో ఆమెనే హీరోయిన్గా పెట్టుకోవాలి అంటూ చాలా ట్రై చేశారు.  కానీ కొన్ని కారణాల చేత అలియా భట్ ఆ సినిమాను రిజెక్ట్ చేసింది .



ఆ తర్వాత ఆ ప్లేస్లోకి జాన్వి కపూర్ వచ్చింది.  అది వేరే మ్యాటర్ . అయితే తాజాగా అలియా భట్ కూతురు రహ బర్తడే ని బాగా సెలబ్రేట్ చేశారు పేరంట్స్. కుటుంబ సభ్యుల సమక్షంలో బర్త డే ను చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ..అలియా భట్ కూతురు కోసం స్పెషల్ గా గిఫ్ట్ ని సెండ్ చేశారట.  ఆ రజ్ పిల్లలకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఒక స్పెషల్ బాక్స్ లో రహ ఆడుకునే విధంగా ఒక గిఫ్ట్ బాక్స్ పంపించారట . అంతేకాదు అందులో రహ ఫొటోస్ కూడా యాడ్ చేశారట . దీంతో అలియాభట్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ తారక్ కు స్పెషల్ థాంక్స్ చెప్పిందట . తెలుగు ఇండస్ట్రీ నుంచి తారక్ మాత్రమే గిఫ్ట్ బాక్స్ పంపించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . ఫ్రెండ్షిప్ కి అంత వాల్యూ ఇస్తాడు తారక్ అని చెప్పడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: