స్టార్ హీరో అక్కినేని నాగార్జున క్రేజ్ పరంగా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లో ఉన్నారు. కుభేర, కూలీ సినిమాలతో 2025లో నాగ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే నాగార్జున సినీ కెరీర్ లోని ప్రత్యేకమైన సినిమాలలో అన్నమయ్య ఒకటి. 1997 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించడంతో పాటు ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.
 
సినిమా 42 కేంద్రాలలో 100 రోజుల పాటు ప్రదర్శించబడింది. ఈ సినిమా మొత్తం 41 పాటలు ఉన్నాయి. ఈ పాటలలో ఎక్కువ పాటలు అన్నమయ్య సంకీర్తనలు కావడం గమనార్హం. అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల దేవస్థానం సెట్ వేసి ఈ సినిమా షూట్ చేయడం జరిగింది. అన్నమయ్యపై సినిమా తీయాలని చాలామంది దర్శకులు ప్రయత్నించినా ఆ అదృష్టం రాఘవేంద్రరావుకు దక్కగా ఆ సినిమాలో నటించే అదృష్టం నాగార్జునకు దక్కింది.
 
సినిమా నాగార్జున ఇమేజ్ ను మార్చేసిన సినిమాలలో ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన తొలి పౌరాణిక సినిమా అన్నమయ్య కాగా తమిళ, హిందీ భాషల్లో డబ్ అయ్యి ఆ భాషల్లో సైతం హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాపై కొన్ని విమర్శలు సైతం వచ్చాయి. సినిమాలో అన్నమయ్యకు మీసం ఉండడంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారు.
 
అన్నమయ్య ఇద్దరు భార్యలతో డ్యూయెట్లు పాడటంపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. అన్నమయ్య సినిమా కోసం నాగార్జున ఎంతో కష్టపడగా ఈ సినిమాతో ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి. అన్నమయ్య అనే పదం వినిపిస్తే నాగార్జున పోషించిన పాత్ర ప్రేక్షకుల కళ్ల ముందు మెదులుతుంది. నాగార్జున తర్వాత రోజుల్లో సైతం భక్తిరస సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నారు. నాగ్ పారితోషికం ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: