అయితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నేటితరంలో మాత్రం స్టార్ హీరోలు ఎంతో మంది ఉన్న ఇలా రాముడి పాత్ర పోషించేందుకు మాత్రం ఎవ్వరు ధైర్యం చేయలేదు. ఇలాంటి సమయంలో అటు టాప్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ ఏకంగా రామాయణంతో మరోసారి ప్రేక్షకులను పలకరించాలని సిద్ధమయ్యాడు. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఆది పురుష్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కి భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే ఒకప్పుడు ప్రేక్షకులకు రాముడు అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తుండిపోయారో.. ఇక నేటితరం ప్రేక్షకులకు ఆది పురుష్ సినిమాతో రాముడు అంటే ప్రభాస్ గుర్తుండిపోతాడు అని అభిమానులు అనుకున్నారు.
ఇలా ఆది పురుష్ అనే టైటిల్ తో రామాయణం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా చివరికి ప్రభాస్ ను అభాసుపాలు చేసింది. ఏకంగా రాముడి వేషధారణను అవహేళన చేసే విధంగా దర్శకుడు ఈ సినిమాలో రాముడి పాత్రను డిజైన్ చేశాడని.. కేవలం రాముడి పాత్రను మాత్రమే కాదు పూర్తిగా రామాయణాన్నే తప్పుగా చూపించారంటూ విమర్శలు వచ్చాయి. దీంతో వందల కోట్ల బడ్జెట్ తో ఎక్కిన ఈ సినిమా చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఫ్లాప్ అవటం ఒక ఎత్తైతే చివరికి ఈసినిమాపై వచ్చిన విమర్శలు మరో ఎత్తు. ఇలా నేటితరం ప్రేక్షకులకు ప్రభాస్ రాముడిగా మిగిలిపోతాడు అనుకుంటే చివరికి ప్రభాస్ కే ఈ సినిమా ఒక చేదు అనుభవంలా మిగిలిపోయింది.