ఎక్కడ చూడు పాన్ ఇండియా హీరోలు ..పాన్ ఇండియా డైరెక్టర్లు ..పాన్ ఇండియా ప్రొడ్యూసర్లు ఇదే వార్తలు ఇదే మాటలు అసలు సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోలు తప్పిస్తే మిగతా హీరోలు లేరా ..? అనే రేంజ్ లో మాట్లాడుకోవాల్సిన సిచువేషన్ క్రియేట్ అవుతుంది అది ఏ ఇండస్ట్రీ అయినా సరే.  సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా మూడు రకాల హీరోలు ఉంటారు.  హీరోస్ ..టైర్ 2 హీరోస్.. బిలో యావరేజ్ హీరోస్ . స్టార్ హీరోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


నాన్న పేర్లు తాతలు పేర్లు ..పలు పబ్లిసిటీ లతో పాపులారిటీతో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు.  వీళ్ళకి స్పెషల్గా క్రేజ్ అవసరం లేదు . ఆ క్రేజ్ తోనే ఇండస్ట్రీ లోకి వచ్చి ఉంటారు . అయితే టైర్ 2  హీరోల పరిస్థితి అలా కాదు . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సొంత టాలెంట్ తో పైకి ఎదిగి పెద్ద పెద్ద సినిమాలల్లో  నటించి హిట్స్ కొట్టి తవకంటూ స్పెషల్ ఇమేజె క్రియేట్ చేసుకుంటారు . కాగా ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది డైరెక్టర్ లు పాన్ ఇండియా హీరోలతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు..అలాగే డిసైడ్ అవుతున్నారు. టైర్ 2  హీరోలని పట్టించుకోవడం లేదు .



అరా కొరా డైరెక్టర్లు పట్టించుకుంటున్న రెమ్యూనరేషన్ సరిగ్గా ఇవ్వడం లేదు . సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఓకే ..నెగటివ్ టాక్ వస్తే ఆ హీరోలని ఇండస్ట్రీ నుంచి పంపించే విధంగా ట్రోలింగ్ కూడా జరిగేస్తుంది. దీనితో టైర్ 2 హీరోలు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . టైర్ 2 హీరోలు కూడా రెమ్యూనరేషన్ ఇంతే ఉండాలి అంటూ డిమాండ్ చేస్తున్నారట . అందరు ఒకటే మాట మీద ఉంటూ సినిమాకి బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఆ స్థాయిలోనే రెమ్యూనరేషన్ కూడా తీసుకోవాలి అంటూ ఫిక్స్ అవుతున్నారట . అంతేకాదు ప్రతి హీరో  కూడా ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా పాన్ ఇండియా అంటూ 100 కోట రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు . అయితే టైర్ 2 హీరోలు కూడా అదే విధంగా రెమ్యూనరేషన్ తమ మార్కెట్ కి తగ్గట్టు ఫిక్స్ చేస్తున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారింది. దీంతో పాన్ ఇండియా  హీరోలకి కొత్త తలనొప్పి స్టార్ట్ అయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: