కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ 'కంగువ'.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి...ఈ సినిమాను మేకర్స్ గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.ముఖ్యంగా తెలుగు లో భారీ గా ఈవెంట్స్ నిర్వహించడం విశేషం. సినిమా కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుందని నిర్మాత కూడా బలంగా నమ్ముతున్నారు. ఇక ఫైనల్ గా సెన్సార్ వర్క్ ను ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.ఈ చిత్రం 350 కోట్ల భారీ బడ్జెట్ తో  నిర్మించబడింది. తమిళ సినిమా అయినా కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చాలా అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో సినిమా పై అంచనాలు తారా స్థాయికి చేరాయి.. 

ఈ సినిమాలోని అడ్వెంచరస్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ మేకర్స్ ట్రైలర్ లో చూపించారు.. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.అయితే సెన్సార్ బోర్డు నుంచి ఈ మూవీ కి యూఏ సర్టిఫికెట్ రావడంతో అందరూ షాక్ అయ్యారు.. ఈ సినిమాలో రక్తపాతం సృష్టించే బోల్డ్ సీన్స్ ఉన్నట్లు ట్రైలర్ తోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఊహించని రేంజ్ ఫైట్స్ ఈ సినిమాలో ఉంటాయని ఫ్యాన్స్ కూడా భావించారు..అయితే ఇప్పుడు U/A సరైఫికెట్ రావడంతో సినిమాలో అలాంటి మాస్ సీన్స్ లేవేమో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు...మరింత ఆకర్షణీయం గా ఈ సినిమా, ప్రేక్షకులకు 3డీ అనుభవాన్ని అందించనుంది. 3డీ ఎఫెక్ట్స్‌తో సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు మరింత బలంగా ఉంటాయని యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం కంగువ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. నవంబర్ 14 న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: