టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతూ బండ్ల గణేష్ రచ్చ రచ్చ చేస్తారు.  టాలీవుడ్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మతగా మారిపోయారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో నటిస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీరాభిమానిగా కొనసాగుతున్నారు బండ్ల గణేష్.


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై  ఈగ వాలిన... వాళ్ల పని చెప్పేందుకు రంగంలోకి దిగుతున్నారు. అయితే శుక్రవారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజకీయ ప్రముఖులు అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.  కానీ టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు కూడా దీనిపై స్పందించలేదు.

కొంతమంది మాత్రం శుభాకాంక్షలు చెప్పి వదిలేశారు.ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినట్లు ఎక్కడ కనిపించలేదు. అయితే ఇదే అంశంపై బండ్ల గణేష్ చాలా సీరియస్ అయ్యారు. రేవంత్ రెడ్డికి ఎందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా... ప్రశ్నించారు బండ్ల గణేష్. సినిమా టికెట్ల రేట్లు పెంచాలని... మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు హీరోలు వచ్చారని గుర్తు చేశారు.


టికెట్లు పెంచాలని కోరడానికి... వచ్చిన హీరోలు... రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఇదెక్కడి అన్యాయం అంటూ ఆగ్రహించారు. టాలీవుడ్ పెద్దలపై కూడా చాలా సీరియస్ అయ్యారు బండ్ల గణేష్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి రచ్చ చేశారు. అయితే బండ్ల గణేష్  చేసిన పోస్ట్ పై కొంతమంది స్పందిస్తూ... ఇప్పుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెబుతున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: