అందుకే సురేందర్ రెడ్డితో.. పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాపై ఎవరికీ నమ్మకాలు లేవు. చివరికి ఆ సినిమాపై నిర్మాత రామ్ తాళ్లూరుకి కూడా నమ్మకాలు లేవు. పవన్ కళ్యాణ్ కు తాను అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చి కూడా ఐదేళ్లు అవుతోంది. బయట నుంచి తెచ్చిన డబ్బు కాదు.. అది నా సొంత డబ్బు. ఇప్పటివరకు పవన్‌తో సినిమా చేయలేకపోయాను. నా బ్యాడ్ లక్.. కరెక్ట్‌గా ఓకే చెప్పిన టైంకు సురేందర్ రెడ్డి వెళ్లి అఖిల్‌తో సినిమా చేశాడు. అదే టైంలో కరోనా కూడా వచ్చిందని నిర్మాత రామ్ వాపోయారు. సురేందర్ రెడ్డి చెప్పిన కథ పవన్ కు విపరీతంగా నచ్చేసిందట. కథ విన్న వెంటనే పవన్ వెళ్లి మరి సురేందర్ రెడ్డిని వాటేసుకున్నాడట.
కానీ.. ఏజెంట్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత సురేందర్ రెడ్డితో.. పవన్ కళ్యాణ్ సినిమా చేస్తాడని అనుకోవడం అత్యాశే అవుతుంది. అది సాధ్యమయ్యే పని కాదు. పవన్ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు, ఓజి సినిమాలు పూర్తి చేసేందుకు పది పదిహేను రోజుల టైం చాలు. దానికే పవన్ కళ్యాణ్ కు ఖాళీ లేదు. అలాంటి టైంలో అతిపెద్ద డిజాస్టర్ ఇచ్చి అఖిల్ కెరీర్ ను పూర్తిగా దెబ్బ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కొత్తగా కాల్ షీట్లు ఇచ్చి సినిమా ఎంత మాత్రం చేయడు. ఏది ఏమైనా రామ్ తాళ్లూరి ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకుంటారా.. లేదా ఎప్పటికైనా పవన్‌తో సినిమా చేయాలని అదే పంతంతో ఆశలతో ఎదురు చూస్తారా ? అన్నది కాలమే నిర్ణయించాలి.